ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రాగి జావ మరియు ఓట్స్ పాలలో వేసుకొని తీసుకోవడం మొదలుపెట్టారు ఇవి రోజు ఆహారంలో తీసుకోవచ్చా లేదా అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. రాగి జావా అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్నది. ఓట్స్ అనేది ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మనకు మార్కెట్లో దొరకడం ద్వారా మనం కూడా ఉపయోగిస్తున్నాం. కొంతమంది టిఫిన్ సమయంలో ఇడ్లీ, దోస, పెసరట్టు వంటివి ఆహారంగా తీసుకోవడం మానేసి ఇలాంటివి తీసుకోవడం మొదలు పెట్టారు. ఇవి బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.
కానీ రోజు వీటిని తీసుకోవడం వలన మనకు అన్ని రకాల పోషకాలు మరియు విటమిన్స్, మినరల్స్ వంటివి పూర్తిగా లభించవు. అందువలన వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ బలహీనపడతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిదే కానీ వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. మరియు ఇవి ఉడికించిన ఆహారం అవ్వడం వలన వాటిలోని కొన్ని పోషకాలు కోల్పోతాయి. గనుక పోషకాహారలోపం ఏర్పడుతుంది. మరియు ఆఫీసుకు వెళ్లే సమయంలో త్వరగా అవుతాయని వీటికి బాగా అలవాటు పడిపోయారు.
వీటి స్థానంలో వీటికన్నా మంచివి అల్పాహారంలో ఉపయోగపడేవి మొలకెత్తిన గింజలు మరియు ఫ్రూట్స్. వీటిని తీసుకోవడం ద్వారా మనకు మంచి పోషక విలువలు లభించడంతోపాటు బరువు కూడా తగ్గుతారు. మరియు వీటి ద్వారా మన సమయం కలిసొస్తుంది. ఉదాహరణకు రాగి జావా, ఓట్స్ ను ఇనుముతో పోల్చుకోవచ్చు. వీటిలో ఐరన్, కాపర్ వంటి పోషక విలువలు ఉంటాయి గాని తక్కువ మోతాదులో ఉంటాయి. రెండవదిగా ఫ్రూట్స్ వీటిలో పోషక విలువలు ఎక్కువ మోతాదులో ఉంటాయి మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
మరియు కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో ఉంటాయి అందువలన వీటిని బంగారంతో పోల్చవచ్చు. మూడవదిగా అతి ముఖ్యమైనది మొలకెత్తిన గింజలు. వీటిలో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి అంతేకాకుండా అనేకమైన మినరల్స్ మరియు పిండి పదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. అందువలన వీటిని వజ్రం తో పోల్చవచ్చు. కనుక మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ విలువైన బంగారం తో పోల్చిన ఫ్రూట్స్ గాని, లేదా వజ్రం వంటి మొలకెత్తిన గింజలను అల్పాహారంలో తీసుకోవడం వలన అధిక బరువు నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా అన్ని పోషకాలు లభిస్తాయి.