weight loss home remedy in telugu

మీకు పొట్ట ఉందా ఇలా చేస్తే వేలాడే పొట్ట కూడా కరిగిపొవలసిందే.

ఇప్పటి మనిషి బాధ ఇంతింత కాదయా అనిపిస్తుంది. ఎండలో ఒళ్ళు వంచి పనిచేసే కాలం పోయి ఏసీ లలో చల్లగా గంటల తరబడి కదలకుండా కూర్చుని పనిచేయడమే ప్రస్తుత వృత్తులన్ని. దీనివల్ల అందరిలో తొందరగా అటాక్ అయ్యే సమస్య పొట్ట పడటం. ముప్పై కూడా దటకనే డ్రెస్సులకు అతుక్కుని, షర్ట్ బటన్ లను చీల్చేస్తా అన్నట్టు ముందుకు చొచ్చుకు వచ్చిన పొట్ట బహు పరాక్ అనిపిస్తుంది.

 అయితే కేవలం ఒకచోట కూర్చుని పనిచేయడం వలన మాత్రమే కాదు తీసుకునే ఆహారం కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎంతగా అంటే సన్నగా ఉన్నవారు కూడా  రోజుల వ్యవధిలో స్థూలకాయులుగా మారిపోయే విధంగా ఇప్పటి ఆహారపు అలవాట్లు ఉంటున్నాయి. వేలాడే పొట్టను మంచులా కరిగించేసే చిట్కామీకోసమే ఇపుడు చెప్పబోతున్నా అయితే అది చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం చెప్పుకోబోయే చిట్కా పాటిస్తే  మనకు చిరాకు కలిగించే పొట్ట తొందరగా మాయమైపోయి నాజూకైన నడుముతో బల్లపరుపు లాంటి కడుపు చల్లగా ఉంటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు

◆ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు తొందరగా  కరుగుతుంది. అలాగే శరీరానికి కావలసిన లవణాలు అందుతాయి. దీనివల్ల శరీరంలో అవయవాలు ఉత్తేజం అవుతాయి.

◆అల్పాహారం పేరిట నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు, దీనివల్ల కొలెస్ట్రాల్ ఊహించని విధంగా పెరిగిపోతుంది. ఇడ్లి, దోశ,  పొంగలి వంటి నూనె తక్కువ అవసరం అయ్యే టిఫిన్లు తీసుకోవాలి.

◆భోజనంలో అధిక పులుపు, ఉప్పు, కారం, మసాలాలు తగ్గించాలి.  దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, అంతేకాదు రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలిగించకుండా ఉంటుంది.

◆ఆహారాన్ని ఒక నియమానుసారం తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో అవయవాలకు ఒక పద్ధతి ప్రకారం శక్తి అందజేయబడుతుంది కనుక కొవ్వులు నిల్వ అయ్యే ప్రసక్తి ఉండదు. 

◆రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అది నడక కావచ్చు, జాకింగ్, ఆసనాలు వంటివి ఏవైనా కావచ్చు.

పైన చెప్పుకున్నవి పాటిస్తూ ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కా ను ఫాలో అయితే పొట్ట ఫటాఫట్ అన్నట్టు తగ్గిపోతుంది. 

కావాల్సిన పదార్థాలు

వెల్లుల్లి

జీలకర్ర

తేనె

పైన చెప్పుకున్నవి సేకరించుకోవాలి.

వెల్లుల్లి రెబ్బలను సన్నని మంటలో పెనం మీద దోరగా వేయించుకోవాలి. నూనె వేయకూడదు. 

ఇపుడు ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద వేడి చేసుకుని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఈ నీటిలో ఒక స్పూన్ తేనె కలపాలి.  ఉదయాన్నే వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు తిని తేనె కలిపిన వేడి నీటిని తాగడం ద్వారా పొత్తి కడుపు నడుము వంటి భాగాల్లో పేరుకు పోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. ఒకవేళ తేనె అందుబాటులో లేకపోతే వెల్లుల్లి రెబ్బలు తిని గ్లాసుడు వేడి నీటిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి కలిపి తాగాలి. ఇది కూడా ఉదయాన్నే చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చివరగా…..

వెల్లుల్లి శరీరంలో అదనపు కొవ్వును కరిగించడంలో  మాత్రమే కాకుండా శరీరంలోని విషాలను బయటకు తరిమి కొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పొట్ట పోవాలంటే ఈ చిట్కా చేసి చూడండి.

Leave a Comment

error: Content is protected !!