weight loss home remedy with 6 herbs

పొట్ట, శరీరంలో ఉండే కొవ్వును వేగంగా తగ్గించుకోడానికి అద్భుతమైన పౌడర్

హలో ఫ్రెండ్స్.. మన శరీరం రెండు సమయాల్లో బరువు చాలా తొందరగా తగ్గుతుంది ఒకటేమో వర్కౌట్ చేసినప్పుడు మరొకటి మనం నిద్రపోయేటప్పుడు. నిద్ర పోయేటప్పుడు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు హెవీ డిన్నర్ చేయకూడదు అలాగే నిద్ర పోయే ముందు కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడడం ద్వారా మన బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఎవరైతే  నిద్ర పోవడానికి రెండు నుంచి మూడు గంటలు ముందు భోజనం చేస్తారో అలాంటి వారి శరీరంపై బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా తొందరగా వేగంగా అద్భుతంగా పనిచేస్తాయి. దీని వలన ఒక సాధారణమైన వ్యక్తి 800 గ్రాముల నుండి ఒక కిలో బరువు వరకు నిద్రలోనే చాలా సులభంగా తగ్గిపోవచ్చు.

ఈరోజు మనము రాత్రిపూట బరువు ఎలా తగ్గించుకోవాలో ఒక చిట్కా ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ చిట్కా కొరకు మీరు ఇప్పుడు చెప్పబోయే పౌడర్ ని తయారు తీసుకొని భద్రపరచుకోవాలి. మరి పౌడర్ తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • సోంపు 50 గ్రాములు
  • పసుపు 1/2 tbsp
  • అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) 25 గ్రాములు
  • జీలకర్ర 25 గ్రాములు
  • కరివేపాకు పొడి 25 గ్రాములు
  • కరక్కాయ 25 గ్రాములు (కరక్కాయ పౌడర్ దొరకకపోతే త్రిఫల చూర్ణం కూడా వాడుకోవచ్చు.)
  • సైంధవ లవణం 1/2 tbsp
  • ఇంగువ 2 చిటికెలు.

తయారీ విధానం

ముందుగా అవిసె గింజలు సోంపు జీలకర్ర లో ఫ్లేమ్ లో కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఒక మిక్సర్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పౌడర్ లోకి  25 గ్రాముల కరక్కాయ పౌడర్, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సైంధవలవణం వేసుకోవాలి. సైంధవ లవణం లేకపోతే నల్ల ఉప్పు వాడుకోవచ్చు.
తర్వాత ఇందులో రెండు చిటికెలు ఇంగువ, 25 గ్రాములు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి. అన్నింటిని కలిపి ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి.

ఈ పౌడర్ ను ఎలా వాడాలి

భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్ర పోయే ఒక గంట ముందు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి. వేడి నీరు అంటే మనము తాగగలిగేతంట వేడిగా ఉండాలి. మీకు దీని ఫలితాలు తొందరగా కావాలి అనుకుంటే కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. దీన్ని ప్రతిసారి కేవలం ఒక్కసారి పావు టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకుని తాగాలి అంతకు మించి ఎక్కువగా కలుపుకుని తాగకూడదు

ఉపయోగాలు 

ఈ పౌడర్ మన కడుపు మరియు  మన శరీరంలో మిగతా ప్రదేశాలలో పేరుకుపోయిన కొవ్వును  తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వలన ఇందులో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది ఇది మన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

ఎవరైతే మలబద్దక సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు రోజు అవిసె గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి సహాయంతో తీపి మరియు ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు సులభంగా కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

కరక్కాయ పౌడర్ మన జీర్ణవ్యవస్థను  చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎవరైతే బయట దొరికే జంక్ఫుడ్స్ మరియు తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు అలాంటి వారు కరక్కాయ పౌడర్ ను ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఇది మన మెటబాలిజం మరియు immune system ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల పొట్ట ప్రదేశంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తొందరగా కరుగుతుంది.

సోంపు తినడం వల్ల లాలాజలం ఉమ్ము ఎక్కువగా తయారవుతుంది. ఈ ఉమ్ము మన కడుపు లోకి వెళ్లి మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణం చేయడానికి అవసరమైన జీర్ణరసాలు అలాగే మన జీర్ణాశయాన్ని చురుగ్గా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!