ఔషధం కానీ ఔషధం మెటబాలిక్ డీ టాక్సిఫికేషన్. 18 గంటల డీటాక్సిఫికేషన్ ఔషధం. దీనినే ఏకభుక్త వ్రతం అంటారు. అంటే ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. ఇలా ఏకభుక్తం చేస్తే శరీరం హెల్తీగా యాక్టివ్ గా ఉంటుంది. దీని రోజు చేయడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఏకభుక్తం చేయాలనుకున్నప్పుడు ఉదయం పూట తింటే సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటే ఆకలేసి నిద్ర పట్టదు. ఆకలి మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట పాచి ముఖం మీద అంత ఎక్కువగా ఉండదు. ఇలా ఏకభుక్తం చేయాలి అనుకుంటే 12:30 వరకు నీళ్ల మీద ఉండటం మంచిది.
ఆరోజు నాలిక గియకుండా, మొహం కడుక్కోకుండా ఉంటే ఆకలి అనిపించదు. ఇక 12:30 కి ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు, లేదు అనుకుంటే వెజిటేబుల్ జ్యూస్ అయినా తాగొచ్చు. ఒంటి గంటకి అన్నమే తినాలి. పుల్కాలు తినకూడదు. ఎందుకు అంటే ఏకభుక్తం కాబట్టి అందుకని అన్నం వండేటప్పుడు కొబ్బరి పాలు పోసి వండుకుంటే బలం ఎక్కువ ఉంటుంది. ఒకేసారి తిన్న ఎక్కువగా పోషకాలను ఇచ్చేవి తినాలి. కొబ్బరికాయలు మరియు పాలకూర, తోటకూర ఈ రెండు ఆకుల రసాన్ని తీసి కొబ్బరిపాలను తీసి రెండింటినీ కలిపి మనం తినాలనుకున్న బాస్మతి రైస్ లో వేసి ఉడికించాలి.
అన్నంలో పెసరపప్పు గాని సెనగల గాని వేసేసి ఉడికించుకుంటే ఉడుకుతాయి. ఇలా అన్నం వండుకుని దీనిలో ఒక కూర, రెండు కూరలు వండుకొని మధ్యాహ్నం పూట తినాలి. 60% శాతం అన్నం ఉండాలి 40% కూర ఉండాలి. భోజనం తర్వాత ఒక వేరుశనగపప్పుల ఉండో, జీడిపప్పుల ఉండో, లేదా డ్రై ఫ్రూట్స్ ఉండైనా ఏదో ఒకటి రెండు స్వీట్లు తినాలి. మెటబాలిక్ డీ టాక్సిఫికేషన్ కోసం డే ఇలా చేసి నైట్ తినము అనుకుంటే ఆకలి వేయదు. సాయంత్రం పూట మంచినీళ్లు తాగాలి. రాత్రి పూట బాగా ఆకలేస్తే ఒక గ్లాస్ తేనె నీరు తాగితే సరిపోతుంది. సుమారు 18 గంటలు డీ టాక్సిఫికేషన్ మెటబాలిజంకి సంబంధించి జరుగుతుంది.
ఈ విధంగా మెటబాలిక్ డీ టాక్స్ఫికేషన్ రెండోరోజు తీసుకోవాల్సిన ఆహారపు నియమాలు. మరి ఇలా తీసుకుంటేనే మెటబాలిజం అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.