weight loss remedy with raddish

ఒక నెలలోనే 10 కేజీలు తగ్గిపోయి స్లిమ్ముగా అవుతారు కావాలంటే రాసిపెట్టుకోండి

అధిక బరువుతో బాధపడుతున్నారా? తగ్గడానికి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించినా సరైన ఫలితం లేనప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించి చూడండి  అతి తక్కువ రోజుల్లోనే మీ శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోయి, అధిక బరువు సమస్య నియంత్రణలోకి వస్తుంది. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా ఆహారాన్ని చూసుకోవాలి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగుతూ ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించడం వలన మంచి ఫలితం వస్తుంది. దీని కోసం మనం ముల్లంగి దుంపల ఆకులను తీసుకోవాలి. ముల్లంగి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో అనేక రకాల రుగ్మతలను తగ్గించుకోవచ్చు.

 అలాగే ముల్లంగి ఆకులను కూడా ఆకుకూరగా ఉపయోగిస్తూ ఉంటారు. సల్ఫరస్ సమ్మేళనాలను కలిగి ఉన్న ముల్లంగి ఆకులు పరాన్నజీవివలన కలిగే జీర్ణాశయ ఇన్ఫెక్షన్‌ను నిరోధించవచ్చని మరియు అతిసారం యొక్క లక్షణాలను తొలగిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.  అవి పిత్త ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి.  సరైన జీర్ణక్రియకు మరియు కాలేయం మరియు పిత్తాశయం యొక్క మెరుగైన పనితీరుకు పిత్తం అవసరం. తక్కువ GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.  ఇది క్రమంగా, రక్తంలో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది, ఇది సరైన కొవ్వును కరిగించడానికి అవసరమైనది.  అందువల్ల ముల్లంగిని ఆహారంలో తీసుకుంటూ ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

ఇప్పుడు చిట్కా కోసం ముల్లంగి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చెయ్యాలి. దీనిని మిక్సీలో వేసి కొద్దిగా నీటిని వేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని దీనినుండి జ్యూస్ను వడకట్టాలి. ఈ జ్యూస్ లో పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ నల్లఉప్పు, ఒక అర చెక్క నిమ్మరసం పిండాలి. వీటన్నింటినీ బాగా కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన శరీరంలోని విష వ్యర్థాలు బయటకు పంపి కడుపు శుభ్రం చేస్తుంది. అధికబరువు సమస్య తగ్గడానికి సహాయపడుతుంది. ఇలా మంచి వ్యాయామంతో పాటు ఈ జ్యూస్ తాగడం వలన కొన్ని రోజుల్లోనే బరువు తగ్గి స్లిమ్ గా అవుతారు.

Leave a Comment

error: Content is protected !!