Weight Loss Technique How to Lose Weight Easily

ఇలా చేస్తే ఆశించిన విధంగా బరువు తగ్గి స్లిమ్ గా అవుతారు…

సరైన మార్గంలో బరువు తగ్గడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దుష్ఫలితాన్ని ఇచ్చే మార్గాల్లో బరువు తగ్గడం వల్ల కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలా పడితే అలా బరువు తగ్గడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎప్పుడైనా బరువు తగ్గాలి అనుకుంటే ఆహార నియమాలు, వ్యాయామం ఈ రెండిటినీ చేస్తే మంచి లాభం ఉంది. ఈ రెండింటిని కాకుండా బరువు తగ్గాలి అనుకుంటే అనారోగ్యానికి ఎక్కువ గురి అవుతారు. కొవ్వు ని కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి మంచి పోషకాలు ఉన్న డైట్ ని మాత్రమే తీసుకోవాలి. లో క్యాలరీ మరియు హై ఫైబర్ డైట్ తీసుకుంటూ పోషకాలు బాగా ఉండే జ్యూస్ లు, ఫ్రూట్స్, నట్స్ తింటూ బరువు తగ్గొచ్చు. 

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటారు. కానీ పూర్వం రోజుల్లో సాయంత్రం భోజనం త్వరగా తినేసేవారు కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినేవారు. ఈరోజుల్లో బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తినడం జరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉండదు. బ్రేక్ ఫాస్ట్ మాని లంచ్ లో ఒక పుల్కా గాని రెండు పుల్కాలు ఎక్కువ కూరలు, ఎక్కువ ఆకుకూరలు తీసుకున్నప్పుడు బరువు తగ్గే అవకాశం ఉండి డీటాక్స్ఫికేషన్ కూడా జరుగుతుంది. ఊబకాయం అనంగా గుర్తొచ్చేది స్వీట్స్ ఇవే ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారని అంటారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినకూడదు.

అవేమిటంటే బియ్యపు రవ్వ, మైదాపిండి, బొంబాయి రవ్వ ఇవన్నీ క్యాలరీస్ ని పెంచేస్తాయి. దానివల్ల వెయిట్ ఆటోమేటిక్ గా పెరుగుతారు. కాబట్టి మీరు బరువు తగ్గాలి అనుకుంటే పంచదార మానేయండి, స్వీట్లు మానేయండి దాంతోపాటు ఈ పిండి పదార్థాలను కూడా ఎక్కువగా తినడం మానేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా షుగర్ తగ్గడం కొవ్వు కరగడం జరుగుతుంది. ఒక్కసారి బరువు తగ్గిన తర్వాత డైట్ ఫాలో అవకుండా తింటే బరువు పెరుగుతారు. బరువు తగ్గడం ఐడియల్ వైట్ మెయింటైన్ చేయడం అనేది లైఫ్ లాంగ్ చేయాలి. అధిక బరువు ఉన్నవారు తగ్గడం ఎంత ముఖ్యమో బరువు పెరగకుండా చూసుకోవడం అంతే ముఖ్యం.

ఇలా ఆరోగ్య నియమాలు పాటిస్తూ బరువు తగ్గితే మళ్లీ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూనే ఉండాలి.

Leave a Comment

error: Content is protected !!