అధిక బరువు ,పొట్ట, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కారణమవుతుంది. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేనికి సహజ పదార్థాలతో చేసిన రెసిపీ లు చాలా మంచి ఫలితాన్ని చూపిస్తాయి బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ చాలా ఖరీదు ఉంది చాలా దుష్ప్రభావాలు కూడా కారణం అవుతాయి కాని సహజ పదార్థాలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యంతో పాటు అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి.
దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు స్టవ్ మీద నీళ్ళు పెట్టి అందులో కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మరిగి వీటిలో లక్షణాలు నీటిలో దిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరానికి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు శరీరంలో ఉన్న కొవ్వు కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
మిరియాలు కూడా కడుపులో ఉన్న యాసిడ్ ను ప్రోత్సహించి ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీని వలన ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. బియ్యంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనెకి దూరంగా ఉండాలి.
ఈ డ్రింక్ పరగడుపున ఉదయాన్నే క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే శరీరంలో పేరుకొన్న కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో విష వ్యర్థాలు బయటకు పంపి ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో వాడిన పదార్థాలు అన్నీ ఇంట్లోవే కనుక ఎటువంటి ఖర్చు లేదు.
అన్ని పదార్థాలు అన్ని సీజన్స్ లో అందుబాటులో ఉంటాయి కనుక క్రమం తప్పకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ తాగడం వలన గొంతు సమస్యలు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ కూడా త్వరగా తగ్గిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఇంటి చిట్కాలు పాటించి ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.