స్థూలకాయంతో భాద పడుతున్నారా ..! అయితే ఈ టిప్స్ పాటించి చూడండి మంచి ఫలితాలు చూస్తారు ..
- రోజుకి మూడు నుంచి ఇదు లీటర్ల నీళ్ళు తాగాలి.
- భోజనానికి ఒక గంట ముందు నీళ్ళు తాగాలి, అలానే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మానేయాలి.
- గోరువెచ్చని నీటిని తాగితే మరీ మంచిది.
- ఆకు కూరలని అధికంగా తినాలి.
- మాంసాహారానికి వీలైనంత దూరంగానే ఉండాలి.
- పెరుగు బదులు పల్చటి మజ్జిగని ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మలబద్ధకం తగ్గి.. స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- పాలు, పెరుగు, నూనె పదార్ధాలు, తీసుకోవడం మానేయాలి.
- బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.
- పాలు తీసుకోవడం అణివార్యం అయితే, టోన్డ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి.
- అన్నం, ఆలుగడ్డ, ఇతర దుంప కూరలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
- క్యారెట్, బీట్రూట్ తో జ్యూస్ చేసుకొని తాగడం మంచిది.
- సిట్రస్ పండ్ల రసాలు, లేదా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ, బొప్పాస పండు ఊబకాయంతో బాధపడుతున్న వారికి మేలు చేస్తాయి.
- వెన్న, చీజ్, వంటి పదార్ధాలు మంచిది కాదు.. ఇవి తినడం మానేయాలి.
- పుదీనా ఆకు రోజు ఆహారంలో తప్పక తీసుకోవాలి.
- ఆహరంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
- క్యాబేజ్ ను సలాడ్ గా అయినా లేక కూరగానైన ఎక్కువగా సేవించాలి.
- దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- బార్లీ నీళ్ళు ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ డు తాగాలి.
- ఉదయం లేవగానే ఖాళీ కడుపునా గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగాలి… ఇలా రోజుకి అనేక సార్లు తీసుకోవచ్చు.
- చెక్కర, మైదా, ఇతర పిండి పదార్ధాలను పూర్తిగా మానేయాలి.
- టీవీ చూస్తూ తినడం, భోజనానికి మధ్యలో చిరుతిళ్ళు తినడం మానుకోవాలి.
- బేకరీ ఫుడ్స్ జోలికి వెళ్ళరాదు.
- అతి నిద్ర, మధ్యాహ్నం, భోజనం చేసాక నిద్ర పోవడం నివారించాలి.
- ఎయిరేటెడ్ డ్రింక్స్, ఆల్కాహాల్ కు, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.
- గోధుమ రొట్టెలు తినడం వలన బరువు పెరగకుండా, పొట్టరాకుండా ఉంటుంది.
- ఇక అతి ముఖ్యమైనది.. వ్యాయామం… ఇందులో..నడక ఉత్తమం. అలానే కుదిరితే రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర ఏదైనా గేమ్స్ లో పాల్గొనవచ్చు.
YOU MAY ALSO ENJOY THESE ARTICLES