చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అధికబరువు నుండి బయటపడాలి. చాలామంది బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామం చేసినా బరువు తగ్గరు. బయటదొరికే ప్రోడక్ట్స్ కాకుండా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పేది తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గుతారు. మీరు అధికశ్రమ ఏమి లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతారు. బరువు తగ్గటానికి రకాలు ఉంటాయి. ఒకటి సహజ పద్దతి.రెండు ప్రోడక్ట్స్.
ప్రోడక్ట్స్ జోలికి వెళ్లకుండా ఇంట్లో ఉపయోగించే పదార్థాలు వాడుకోవచ్చు. అవి ఒకటి కీరా మరియు అల్లం. అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన తోలు తీసి ఉపయోగించాలి. అల్లం బరువు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలి అంటే జీర్ణ ప్రక్రియ బాగా జరగాలి. జీర్ణప్రక్రియకు అల్లం బాగా సహకరిస్తుంది. అల్లంలో ఉండే లక్షణాలు ఆకలిని నిరోధిస్తాయి. ఆకలి తగ్గడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం. దానివల్ల బరువు తగ్గవచ్చు. అల్లం తిన్నప్పుడు శరీర క్రియలన్నీ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.
అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. అల్లం ఘాటైన రుచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. తర్వాత కీరా తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కీర వేసవిలో దాహం తీర్చడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అర్ధాంతర ఆకలి తగ్గిస్తుంది. విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఎనర్జీ వస్తుంది. ఎండ వలన వచ్చే నీరసం,అలసట లేకుండా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణప్రక్రియకు సహాయపడుతుంది.
తర్వాత ముక్కలుగా కోసుకున్న కీరా,అల్లంని మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. తర్వాత దానిని వడకట్టుకోవాలి ఈ జ్యూస్ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి ఉదయం కుదరనివారు ఈ జ్యూస్ తీసుకోవడానికి ముందు అరగంట వరకు ఏమీ తీసుకోకుండా ఉండాలి.అర చెక్క నిమ్మరసం పిండాలి. నిమ్మకాయ బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ సి మరియు అనేక పోషకాలు అందిస్తూ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తాయి.
జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది. ఈ డ్రింక్ రోజు ఉదయం తీసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే కుదరనివారు ఏదైనా తినడానికి అరగంట ముందే ఈ జ్యూస్ తాగడం మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే త్వరగా బరువు తగ్గుతారు. ఎప్పుడూ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలి. ఒక్కసారిగా బరువు పెరుగు కూడదు, తగ్గకూడదు. ఒక క్రమ పద్ధతిలో బరువు తగ్గడం మంచిది. ఇది తాగడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడాఈ జ్యూస్ చాలా బాగా సహకరిస్తుంది.