అధిక కొవ్వు శరీరంలో కొన్ని చోట్ల పేరుకుపోయి మన రూపాన్ని అందవికారంగా మార్చేస్తూ ఉంటుంది. ఆ కొవ్వు పొట్ట, తొడలు, పిరుదులు చేతులలో చేరి ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. బరువు తగ్గడంకోసం ఎవరేం చెప్పినా ప్రతీ డైట్ ఫాలో అవడం, యోగాలు వ్యాయామాలు ప్రయత్నించడం తర్వాత శరీరం సహకరించక మధ్యలో వదిలేయడం చేస్తుంటాం. దానివలన శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అధికబరువును తగ్గించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తూ పొట్ట, తొడలు, నడుముచుట్టూ చేరిన కొవ్వును మంచులా కరిగించొచ్చు. దీనికోసం ఎలాంటి డైట్ చేయనవసరం లేదు. మన వంటింట్లో ఉండే వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఏడువెల్లుల్లి రెబ్బలను తినాలి. ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒకేరోజు తినాలా అని భయపడుతున్నారా. అలాకాదండి ఒకరోజుకి ఒక వెల్లుల్లి రెబ్బను మాత్రమే తినాలి.
అయితే పచ్చి వెల్లుల్లి వాసన అందరికీ పడదు. అంతేకాకుండా పచ్చిగా కూడా తినలేము. అందుకే కొంచెం వెల్లుల్లిని పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందువల్ల వెల్లుల్లిని నమిలి తినగలం. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజం రేటును సక్రమంగా ఉంచుతాయి. మెటబాలిజం బాగుంటే తిన్న ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చుకుంటుంది. కొవ్వుగా మారి శరీరంలో చేరకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లి ఎన్నో వ్యాధుల బారినుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. అధికబరువును తగ్గిస్తుంది. కాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. రక్తపోటు సమస్యను పెరగకుండా ఆపుతుంది. రక్తనాళాల్లో ఏర్పడిన కొవ్వు గడ్డలను నివారిస్తుంది. అంటే ధమనుల్లో రక్తప్రసరణను సాఫీగా జరిగేలా చేస్తుంది. ధమనుల్లో రక్తప్రసరణ సరిగా జరగకుంటే గుండెకు ప్రమాదం. అందుకే గుండెవ్యాధులు ఉన్నవారు రోజుకొక వెల్లుల్లి రెబ్బను తింటే ఆరోగ్యానికి మంచిది. బాడీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని రోగాలతో పోరాడేలా ధృడంగా చేస్తుంది. శరీరాన్ని నిర్వీషికరణ చేసి విషపదార్థాలు లేకుండా చేస్తుంది. లివర్, కిడ్నీలలో చేరిన వ్యర్థాలను బయటకు పంపడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
వెల్లుల్లిని తీసుకోవడానికి ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. టీ తాగేటప్పుడు ఎంత వేడి ఉంటుందో అంతవేడిగా ఉండేలా నీటిని మరగబెట్టుకోవాలి. ఏడురోజులు వెల్లుల్లిని క్రమంతప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. పైన పొట్టు తీసిన వెల్లుల్లిని కొద్దిగా గిన్నెలో నూనెలేకుండా వేయించి నమిలి తర్వాత వేడినీటిని తాగాలి. ఎప్పుడైనా అతిగా తినడం ప్రమాదకరం. అందుకే రోజుకి ఒకటి మాత్రమే వెల్లుల్లిని తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి చేస్తుంది. మితంగా తినడంవలన శరీరంలో కొవ్వు కరిగి శరీరానికి మంచి షేప్ వస్తుంది. కావాలనుకుంటే వేడినీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇలా తాగడంవలన వచ్చే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్య పోతారు. తేనెకు బదులు జీలకర్ర పొడిని కూడా వాడుకోవచ్చు. జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పొడిలా చేయాలి. ఈ పొడిని నీటిలో కలిపి వెల్లుల్లిని నమిలి తినడంవలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా తీపిపదార్థాలు తినకూడదు. వీలైనంత పంచదార తినడం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారానికి మారాలి. దానితో పాటు వెల్లుల్లిని తింటే అధికబరువు సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.