weight loss with pippallu long pepper

చాలాస్పీడ్ గా మీ పొట్ట,తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వును కరిగించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా..weight loss

పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వును తగ్గించుకోవడానికి చాలా పద్దతులు అవలంభిస్తున్నాం. పొట్ట చుట్టూ కొవ్వు ఆయుర్వేదం ప్రకారం కఫదోషం వలన ఏర్పడుతుంది. దీనికి ముఖ్యకారణాలు మనం తీసుకునే అనారోగ్యాకరమైన  ఆహరం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎక్కువగా నిద్ర పోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వలన శరీరంలో ప్రత్యేక భాగాలు ముఖ్యంగా పొట్ట, పిరుదులు,తొడలు, చేతులులాంటి అవయవాలలో కొవ్వు పెరిగిపోయి చూడడానికి చిరాకుగా కనపడుతుంది. ఈ పొడిని కనుక మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా త్వరగా కొవ్వు కరిగి అధికబరువును తగ్గించుకుంటారు. ఈ ఆయుర్వేద ఔషధంకోసం మనకి కావలసింది పిప్పళ్ళు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఆయుర్వేదంలో పిప్పళ్ళు చాలా చికిత్సల్లో ఉపయోగిస్తారు. ఇంగ్లీష్లో లాంగ్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. కొవ్వును తగ్గించడానికి పిప్పళ్ళు ఎలా వినియోగించాలో తెలుసుకుందాం. ఈ పిప్పళ్ళు ఆయుర్వేద షాపుల్లో లేదా ఆన్లైన్లో సులభంగానే అందుబాటులో ఉంటాయి. ఈ పిప్పళ్ళ ఎక్కువ రోజులు నిలవ ఉండవు.వీటిని పొడి చేసుకుని వాడుకోవాలి. పది నుంచి ఇరవై గ్రాముల పిప్పళ్ళు తీసుకుని వీటిని చిన్న మంటపై డ్రై ప్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేసుకోండి. ఈ పొడి మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. దీనిని ఎలా వాడాలి అంటే చిటికెడు పొడి లేదా పావుస్పూన్ తీసుకుని అందులో పావుస్పూన్ తేనెకలిపి రాత్రిపూట తీసుకోవాలి. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె వాడకూడదు. 

ఘాటుగా కారంగా ఉన్నా ఇది శరీరం లో ప్రవేశిస్తే చాలు ఈజీగా బరువుతగ్గొచ్చు. రోజూ పావుస్పూన్ తీసుకోవడం అలవాటయ్యాక అంటే ఒక వారం రోజుల తర్వాత నుండి అరస్పూన్ తీసుకోండి. రోజూ భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ఈ పొడిని రోజుకి మూడు నుండి నాలుగు సార్లు తీసుకోవచ్చు.జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో ఫలితాలు ఆలస్యంగా ఉన్నా మంచి దుష్ప్రభవాలు లేని ఫలితాలు ఉంటుంది. అలాగే మొండి కొవ్వులు కరిగించి మంచి కొవ్వును పెంచుతుంది. దీనితో పాటు మంచి నడక లేదా వ్యాయామం చేస్తూ ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు తినకూడదు. 

2 thoughts on “చాలాస్పీడ్ గా మీ పొట్ట,తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వును కరిగించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా..weight loss”

Leave a Comment

error: Content is protected !!