What are some disadvantages of radish

ముల్లంగిని తినేవారు పొరపాటున కూడా ఈ రెండు పదార్థాలతో కలిపి తినకండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం

ముల్లంగి ఒక దుంప జాతి మొక్క.  దీని వేరుకు కాసే కాయలను ఆహారంగా మరియు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ముల్లంగి కడుపుసంబంధ మరియు ప్రేగు సంబంధిత రుగ్మతలు, పిత్త వాహిక సమస్యలు, ఆకలి లేకపోవటం, నోరు మరియు గొంతు నొప్పి మరియు వాపులు, అంటువ్యాధులు,  శ్వాస సమస్యలు, అధిక శ్లేష్మం, బ్రోన్కైటిస్, జ్వరం, జలుబు, మరియు దగ్గు నివారణ కోసం ఉపయోగిస్తారు.  ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా అవో మద్దతు ఇస్తాయి.  ముల్లంగి ఎర్ర రక్త కణాల నష్టాన్ని నియంత్రిస్తుంది మరియు రక్తానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో సహాయపడుతుంది.

 ముల్లంగి రూట్ జీర్ణ రసాలను మరియు పిత్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.  ముల్లంగి రూట్ బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులతో కూడా పోరాడగలదు. అంతేకాకుండా ఆకలి లేకపోవడం, నోరు ఇతర ఆరోగ్య పరిస్థితులకు చికిత్స లో ఉపయోగపడుతుంది. ముల్లంగి దుంపల తో పాటు వీటి ఆకులను కూడా అనేక రకాల కూరలు సలాడ్స్ లో ఆకుకూరగా ఉపయోగిస్తుంటారు. ముల్లంగి ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే ముల్లంగి తిన్న వెంటనే తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి తిన్న వెంటనే పాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. 

కీరా దోసకాయ మరియు ముల్లంగిని కలిపి సలాడ్స్ గా కొంతమంది తింటూ ఉంటారు. ఇలా పొరపాటున కూడా తినకూడదు. ఎవరైనా తెలియక ఇలా తినడం వల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా నిమ్మజాతికి చెందిన పులుపు ఎక్కువగా ఉండే పండ్లని కూడా తీసుకోకూడదు. ముల్లంగితో పాటు ఆరెంజ్, కమలా వంటి పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. మీరు ముల్లంగి మరియు చేదును ఏ విధంగానైనా కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా కాకరకాయ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి జీర్ణ సంబంధ సమస్యలు అనేకం వస్తాయి.

Leave a Comment

error: Content is protected !!