ఇసినోఫిల్ అనేది కఫం, పిల్లికూతలకు కారణమవుతుంది. ఇసినోఫిల్ కౌంట్ అనేది ఒక రక్త పరీక్ష ద్వారా కనుగొంటారు. ఇది ఇసినోఫిల్స్ అని పిలువబడే ఒక రకమైన తెల్ల రక్త కణాల సంఖ్యను కొలుస్తుంది. మీకు కొన్ని అలెర్జీ వ్యాధులు, లంగ్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇసినోఫిల్స్ చురుకుగా మారతాయి. ఇసినోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉన్నవారు పంచదార, చల్లని పదార్థాలు, తీపి పదార్థాలు, స్వీట్లు , బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు ఎక్కువగా తీసుకోకూడదు.
ఎందుకంటే ఈ తీపి, చల్లని పదార్థాలు ఇసినోఫిల్ కౌంట్ను పెరిగేందుకు సహకరిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీని తగ్గేందుకు ఇవి దోహదం చేస్తాయి. కనుక వీటిని పూర్తిగా మానేయాలి. మీరు తీపి కోసం ఖర్జూరం పొడి ఉపయోగించుకోవచ్చు. పండు ఖర్జూరం కూడా వాడుకోవచ్చు లేదా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించుకోవచ్చు.
వంటల్లో తీపి కోసం ఖర్జూరం పొడిగా చేసి అది వాడుకోవచ్చు లేదా ఖర్జూరాలను పేస్ట్గా చేసి కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి వారు చాలా వరకు జన్యుపరంగా ఇసినోఫిల్ సమస్యను ఎదుర్కొంటుంటారు. తుమ్ములు, ముక్కు కారడం కొంతమందికి ఆయాసం, పిల్లికూతలు ఉంటాయి. ఇలాంటి తగ్గించుకోవాలంటే ఇంటి దగ్గర దొరికే తేనే వాడకూడదు. ఆర్గానిక్ తేనె మంచిది చూసి కొనుక్కోవాలి. నకిలీ తేనె వాడడం వలన అందులో ఉండే పంచదార పాకం కఫాన్ని పెంచుతుంది.
దీని వల్ల ఇసినోఫిల్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్య తగ్గించుకోవడాని ఉపవాసం ఉండడం కూడా మంచి పద్ధతి. ఆహారం తినకుండా కేవలం నిమ్మరసం, తేనే కలిపిన నీటిని తాగుతూ ఉండడం వలన కూడా శరీరంలో కఫాన్ని తగ్గించుకోవచ్చు. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. జ్యూస్లు, పండ్ల రసాలలో తేనే వాడుకోవచ్చు. తేనె మంచి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది.
ఇలా తేనె, ఖర్జూరం పొడి వాడుతూ పంచదార, బెల్లంని దూరం పెట్టడం వలన జీవితంలో ఈ సమస్య మళ్ళీ రాదు. ఈ సమస్య ఉన్న వారు ఫ్రిజ్లో వాటర్ తాగకూడదు. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. వేడీ నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఈ సమస్య తగ్గించుకోవడానికి స్టీమ్ బాత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యాచురోపతి క్లినిక్లో అటువంటి స్టీమ్బాత్ సేవలు అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ఖర్చులో వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు.
సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నిమ్మరసం, తేనె నీటితో నాలుగు రోజులపాటు ఉపవాసం చేయడం వలన కఫాన్ని తగ్గించుకోవచ్చు. రోజులో రెండు గంటలకు ఒకసారి ఈ తేనె, నిమ్మరసం నీటిని తాగుతూ ఇతర ఆహార పదార్థాలను దూరం పెట్టడం వలన శరీరంలో ఈ సమస్య చాలావరకు అరికట్టబడుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేసుకోండి.