మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయి లేదా కాల్షియం లోపంతో, ఎక్కువగా నడవడం నిలుచుని ఉండేవారిలో చాలా మందికి మోకాళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మందులు అందరికీ అందుబాటులో ఉండవు. మన పూర్వ కాలంలో పెద్దలు ఎటువంటి మందులు ఉపయోగించకుండా కేవలం ఇంటి చిట్కాల ద్వారా పొందేవారు. ఈ నివారణ చిట్కాలు వలన శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బ తినకుండా ఆరోగ్యంగా ఉండేవారు. తరచూ టాబ్లెట్లు తీసుకోవడం వలన అవి మందుల కాక విషంలా మారిపోతుంటాయి. శరీరంలో కిడ్నీలు, లివర్ వంటి అవయవాలపై దుష్ప్రభావాలు చూపుతాయి.
అందుకే ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి నొప్పుల నుండి పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ ఇంట్లో ఉల్లిపాయలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఒక పచ్చి ఉల్లిపాయ తినడం వలన శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు ఇది శరీరంలో మంటను తగ్గించే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. దీని మెత్తని పేస్ట్ లా తురిమి దీనిలో ఒక స్పూన్ పసుపు కలిపి మందపాటి గిన్నెలో వేసుకోవాలి. ఒక నాలుగు చెంచాల ఆవనూనె వేసి ఈ పేస్ట్ ను ఉడికించాలి. చిన్న మంటపై 7 నిమిషాల పాటు ఉడికించడం వలన నూనె బయటకు వస్తుంది. తరువాత స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా మనం భరించగలిగిన వేడి ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.
ఏదైనా పెద్ద ఆకు దానిపై వేయాలి. ఒక గుడ్డ సహాయంతో కట్టు కట్టి రాత్రంతా అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి. ఉల్లిపాయలు వాపుతో పోరాడటానికి సహాయపడే సల్ఫర్ సమ్మేళనాలతో నిండి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మీరు నొప్పి తో బాధపడుతున్నట్లైతే ఉల్లిపాయ నొప్పి నివారణ కీపర్. ఆవనూనె సలీం శరీరంపై వేడిని కలుగజేసి నొప్పి నుండి ఒక సొమ్ము కలుగజేస్తుంది నొప్పులు తగ్గడానికి ఆవ నూనెతో మసాజ్ చేయడం కూడా ఒక మంచి ఐడియా. ఇలా కనీసం నాలుగైదు రోజులు చేయడం వలన నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.