మన శరీరంలో అసంకల్పిత చర్యలాగా జరిగిపోయే వ్యవస్థలో ముఖ్యమైనది గుండె. దాని లబ్ డబ్ శబ్దం ఆగిపోతే మన జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. నిమిషానికి అరవై నుండి తొంబై సార్లు కొట్టుకునే ఈ గుండె రోజుకు లక్షసార్లు తన సైరైన్ మోగిస్తుంది. మన శరీరంలో ధమనుల ద్వారా సరఫరా అయ్యే రక్తం లో ఆక్సిజన్ కలిగి ఉంటుంది. గుండె రెండు భాగాలుగా విభజించబడి కుడి ఎడమల కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.
శరీరం నుండి చెడు రక్తం కుడిబాగానికి చేరి అటు నుండి ఊపిరితిత్తులకు చేరవేయబడుతుంది. అదే విధంగా ఊపిరి తిత్తులలో శుభ్రపడిన రక్తం తిరిగి ఎడమభాగానికి చేరి అటు నుండి శరీరంలో ఉన్న అవయవాలకు సరఫరా అవుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే ఈమధ్య కాలంలో చాలా మందికి ఎదురవుతున్న సమస్య గుండె నొప్పి. అసలు ఈ గుండె నొప్పి ఎందుకు వస్తుంది?? దానికి కారణం ఏమిటి అని విషయాలు పరిశీలిస్తే………

మన శరీరంలో గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలలో రక్తసరఫరాలో అడ్డంకులు వల్ల గుండెకు రక్తసరఫరా ఆగిపోతుంది. రక్తసరఫరా ఆగిపోయినందువల్ల గుండెకు రక్తం అందక మెల్లిగా తన కదలికను కోల్పోతుంది ఈ ప్రక్రియలో గుండె పట్టేసినట్టు అనిపించడమే గుండె నొప్పి.
ఈ గుండె నొప్పి ఛాతీలో మొదలవ్వడం లేదా గుండెను గట్టిగా నొక్కి పట్టినట్టు అవ్వడం వంటి భావనతో కలిగి ఉంటుంది. ఊరితిత్తుల నుండి వడపోత ద్వారా గుండెకు చేరే రక్తనాళం మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు లేక మలిన పదార్థాలతో పూడుకుపోయి రక్తం గుండెకు అందకపోవడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది.
గుండెకు రక్తం అందకపోవడం వల్ల గుండె కండరాలు బలహీనంగా మారిపోయి ఉంటాయి ఈ బలహీనత మీదనే గుండె నొప్పి తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. గుండె కండరం రక్తాన్ని శరీరభాగలకు పంపే సామర్త్యాన్ని శరీర వ్యవస్థ పనితీరును కూడా మందగించేలా చేస్తుంది.ఆ ఈ గుండె నొప్పి ఛాతీలో మొదలయ్యి భుజాల నుండి చేతులకు లేదా భుజాల నుండి వీపు వెనుక భాగానికి పాకుతూ శరీరాన్ని మొత్తం సతమతమయ్యేలా చేస్తుంది.
గుండె నొప్పి వచ్చిన సందర్భంలో శరీరమంతా చల్లబడిపోవడం, విపరీతమైన చెమటలు పట్టడం, ఊపిరి అందకపోవడం, తలతిరిగినట్టు అనిపించి సృహ తప్పడం మొదలైన లక్షణాలు కనబడతాయి.
గుండె నొప్పి రావడానికి మరిన్ని కారణాలు
అతి బరువు ఉన్నవాళ్ళలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉండటం, అందులో శరీరానికి హాని కలిగించే కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండటం.
బిపి షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు అప్రయత్నపు కోపాలు తెచ్చుకోవడం జరిగినపుడు శరీరంలో రక్తప్రసరణ వేగమై అప్పటికే మందగించి గుండె పనితీరును ఒక్కసారిగా ఆగిపోయేలా చేస్తుంది
శారీరక శ్రమ తక్కువగా ఉన్నందువల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు కరగకపోవడం కూడా కారణమవుతుంది.
రోజువారీ వ్యాయామం మరియు నడక, యోగా, ధాన్యం వంటి వాటిలో కనీసం ఒకటి కూడా ఆచరించక పోవడం.
చివరగా….
మరి సమస్య తెలిసినప్పుడు పరిష్కారమేంటో, రోజువారీ జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో కాస్త కష్టపడి సంపాదించుకోండి. మరి మొదలెట్టాలిగా బద్దకాన్ని వదిలించే ప్రక్రియ అందుకే ఈపనితోనే ప్రారంభించండి.