గుండెదడ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే ఒకటి టెన్షన్, ఆందోళన భయానికమైనది చూడగానే గుండె టప్ టప్ మని కొట్టుకుంటుంది. టెన్షన్ ఎక్కువగా వస్తుంటే దానికి మందులు వాడితే సరిపోతుంది. రెండవది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే గుండె దడ వస్తుంది. మూడవది కాఫీ. ఈ కాఫీ ఎక్కువ తాగితే దానిలో ఉండే కెఫిన్ గుండె చప్పుడు పెంచే అవకాశం ఉంది. ఇక ఫీవర్ విషయానికొస్తే ఒక డిగ్రీ ఫీవర్ పెరిగితే పది పాయింట్లు గుండెచప్పుడు ఎక్కువ అవుతుంది. థైరాయిడ్ ఎక్కువ పనిచేసిన గుండె ఎక్కువ కొట్టుకుంటుంది. ఇంకొకటి ఎనీమియా అంటే రక్తహీనత ఉందనుకోండి గుండె ఎక్కువ పని చేయవలసి వస్తుంది.
రక్తం తక్కువ ఉంది శరీరానికి ఆక్సిజన్ సరిగా ఉండదు కాబట్టి గుండె ఎక్కువ కొట్టుకుని ఎక్కువ పని చేయవలసి వస్తుంది. గుండె దడకి ట్రీట్మెంట్ ఇస్తే కుదరదు. అసలు ఎందుకు వస్తుంది దానికి కారణం తెలుసుకుని టెన్షన్ తగ్గించుకోవాలి. కొన్ని టెన్షన్స్ ని తగ్గించలేని పరిస్థితిలో మెడికేషన్ తీసుకోవాలి. థైరాయిడ్ కారణం అనుకుంటే థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకుంటే గుండెదడ తగ్గుతుంది. అదే రక్తహీనతకు ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. B1 డెఫిషియెన్సీ వల్ల కూడా గుండె దడ వస్తుంది. దీనికి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గే అవకాశం ఉంది.
ఇవన్నీ చేసిన గుండె దడ తగ్గకపోతే మనకి గుండెలోనే ఏదో సమస్య ఉంటే దడ పెరిగే అవకాశం ఉంటుంది. గుండె దడ తో పాటు ఈ నాలుగు లక్షణాలు వస్తే అది ప్రమాదానికి సంకేతాలు. ఏమిటి అంటే ఒకేసారి గుండె స్పీడ్ గా కొట్టుకోవడం, రెండవది ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం, ఈ గుండె దడ తో పాటు ఛాతిలో నొప్పి వస్తే అది గుండె జబ్బుకు కారణం, నాలుగవది గుండెదడ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే చాలా ప్రమాదం. ఈ నాలుగు లక్షణాలు గనుక ఉంటే డైరెక్ట్ గా కార్డియాలజిస్ట్ ని కలవాలి. స్వర పేటిక దగ్గర ఆడమ్స్ ఆపిల్ పక్కన వెయిన్ ఉంటుంది. దానిని మసాజ్ చేయాలి. కను గుడ్లు మీద కొంచెం ప్రెషర్ పెంచితే గుండె దడ కొద్దిగా తగ్గుతుంది.
వాల్ సల్వా చేయాలి అంటే ముక్కు మూసేసి గాలిని నోటితో వదలాలి. ఇది కాకుండా ECG చేయాలి. గుండె దడ ఎక్కువ ఉన్నప్పుడు దీనిని చేయాలి. ఒకసారి ఎకో టెస్ట్ చేపించిన గుండెలో ఏం సమస్య ఉందో తెలుస్తుంది.