కివీ చూడడానికి కోడిగుడ్డు ఆకారంలో ఉండే విదేశీ పండు. ఇప్పుడు మనదేశంలో కూడా విరివిగా పండిస్తున్నారు. మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్లను తినడంవలన అద్బుతమైన అనేక పోషకాలు లభిస్తాయి. పైన ముదురుగోధుమ రంగులో లోపల ఆకుపచ్చ రంగు గుజ్జుతో చిన్న చిన్న గింజలను కలిగి ఉంటాయి. ఈ పండు ఒక్కటి తినడం వలన నారింజ, బత్తాయి వంటి అనేక పండ్లలోని గుణాలను పొందవచ్చు. సి విటమిన్ మిగతా పండ్లకంటే ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఈ పండుని వండర్ ప్రూట్ అంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ఈ పండు కొంచెం పుల్లగా, కొంచెం తీపి కలిసిన రుచిలో పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడడానికి కివీ ఉపయోగపడుతుంది. మెదడు చురుకుగా ఉండడానికి, పిల్లలు ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది. కివీలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, విటమిన్ సి ఉండడం వలన పిల్లల ఎదుగుదలలో సహకరిస్తుంది. ఎనిమిది నెలల పిల్లల నుండి ఈ పండు తినిపించవచ్చు. వారిని సీజనల్ వ్యాధులనుండి రక్షిస్తుంది. డెంగ్యూ వ్యాధి వచ్చినవారికి కివీపండు తినడం వలన అద్బుతమైన ఫలితాలు కనిపించాయని డాక్టర్లు చెబుతున్నారు.
రక్తకణాల సంఖ్య పెరిగినట్లు, వ్యాధి త్వరగా తగ్గడంలో సహాయపడినట్లు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకు కివీ తినడం వలన పోషకాలు అంది బిడ్డ ఎదుగుదలకు, సుఖప్రసవానికి దోహదపడుతుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. నిద్ర లేమి సమస్యను తగ్గించి గాఢనిద్ర వచ్చేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండడానికి, కీళ్ళ నొప్పులు రాకుండా చేసే విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కంటిచూపు మెరుగుపడడానికి కివీ ప్రూట్ ఉపయోగపడుతుందని అనేక అధ్యాయనాలు చెబుతున్నాయి.
మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. రోజుకు రెండు కివీ తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండి కడుపునిండిన భావం వచ్చేలా చేసి ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ అజీర్తిని తగ్గించి మలబద్దకం, గ్యాస్ సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వలన వైరల్, బాక్టీరియల్ ఇన్పెక్షన్ల నుండి రక్షిస్తుంది. కివీపండు తినడంవలన రక్తప్రసరణ మెరుగుపడి శృంగార సమస్యలు పరిష్కరింపబడతాయి. సంతాన భాగ్యం లభిస్తుంది.