ఘుమఘుమల వంటలో పచ్చని ఆకు, వంటకు అదనపు రుచి ఇస్తూ అందరి మనసులను దోచేస్తుంది. వంటకీ అది వేయకపోతే వంటకు అంత సీన్ కూడా రాదబ్బా…. అదేనండి కొత్తిమీర. అందరూ ఫాషన్ గా కొరియండర్ అని పిలుచుకునే కొత్తిమీర కేవలం వంటలకు మరియు వంటల పైన గార్నిష్ కోసం అదేనండి అలంకరణ కోసం మాత్రమే కాదు బోలెడు ఆరోగ్యాన్ని పోగు చేసుకోవడానికి కూడా అంటున్నారు వైద్యులు. అసలింతకు కొత్తిమీరలో ఏముంది అది ఎలా ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. చూద్దాం ఒకసారి.
◆కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-కె, విటమిన్-సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
◆అధిక కొవ్వు ఉన్నవాళ్లు కొత్తిమీర ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
◆కొత్తిమీరలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఉన్న అల్సర్ కణాలతో పోరాడి అల్సర్లను నివారిస్తుంది. అందుకే అల్సర్ ఉన్నవారు కొత్తిమీరను తీసుకోవడం ఉత్తమం.
◆జీర్ణాశయంలో పేగుల చుట్టూ ఉన్న పొరను పటిష్టం చేస్తుంది. దీనివల్ల పేగులకు సంబంధించిన సమస్యలు దరిచేరవు.
◆చాలామందిని వేధించే సమస్య ఎసిడిటీ. ఎసిడిటీ ఉన్నవారు రోజు కాసిన్ని కొత్తిమీర ఆకులు లేదా కొత్తిమీర జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
◆కొత్తిమీర ను రోజూ తీసుకోవడం వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలు,వ్యాధులు దూరంగా ఉంటాయి.
◆కొత్తిమీర యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది. అందులోని ఫ్లేవనాయిడ్స్, ఫ్యాన్క్రియటిక్ లు క్యాన్సర్ కణాలతో సమర్థవంతంగా పోరాడి క్యాన్సర్ ను దూరంగా ఉంచుతాయి. అలాగే కొత్తిమీర తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.
◆చాలామందిలో పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటివారు కొత్తి మీరను తీసుకోవడం వల్ల పలితం ఉంటుంది.
చివరగా….
కొత్తిమీరను, వంటకాల్లో, సలాడ్ లు, సూప్ లలో మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా వాడి గొప్ప పలితాలను పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు కొత్తిమీరను తీసుకుంటే లేలేత ఆకుల్లా మీరు కుడా యవ్వనంగా, సన్నగా నాజూగ్గా తయారయిపోవచ్చు. మరి కాసిన్ని ధనియాలు వేసి ఇంట్లోనే పెంచేసుకుంటే పొలా……
మంచి విషయం తెలియచేసినందుకు ధన్యవాదాలు