what happen in our body after drinking cool drink

కూల్ డ్రింక్ త్రాగిన వెంటనే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు

ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కూల్ డ్రింక్స్ ఎలా తయారు చేసిన ఏ కంపెనీ తయారు చేసిన అది మన శరీరానికి హానికరమని. కానీ అన్నీ తెలిసిన ఈ రోజుల్లో కూల్డ్రింక్స్ తాగడం మనకి మునుపటి కంటే రెండు రెట్లు ఎక్కువగా పెరిగిపోయింది. టీవీలో వచ్చే అడ్వటైజ్మెంట్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూల్డ్రింక్స్ తాగడం చూసి మన మనసులో కూడా కూల్డ్రింక్ తాగాలి అని ఆశ పెడుతుంది మరియు ఎండాకాలంలో చాలా మంది దాహం తీర్చుకోవడానికి శరీరం చల్లబరచడానికి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఈ గురించి లోపల కార్పొరేట్ వాటర్, పంచదార, harmful ఆసిడ్స్ మరియు ఆర్టిఫిషల్ కలర్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. దీని వల్ల ఇది మన శరీరాన్నిచల్లబరిచకుండా కడుపులో ఆసిడ్ లెవెల్స్ మరియు శరీరంలో షుగర్ లెవెల్స్ ను చాలా ఎక్కువగా పెంచేస్తుంది. ఎవరైతే కూల్ డ్రింక్ ఎక్కువ మోతాదులో తాగుతారు వాళ్లకు కూడా తెలియని విషయం ఏమిటంటే మన శరీరంలో ఏర్పడే అనేక రకాల అనారోగ్యాలకు ముఖ్యమైన కారణం కేవలం కూల్ డ్రింక్ అని. అన్నిరకాల చెడు ప్రభావాలు కలిగిన కూల్ డ్రింక్స్ తాగిన ఐదు నిమిషాల లోపల ఇది మన శరీరంలో ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. కూల్ డ్రింక్స్ తాగినవ గంట లోపల మన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు కింది వీడియో చూడండి. 


ఈ కూల్ డ్రింక్స్  తాగడం అంటే మనకు మనమే పంచదార తినడం లాంటిది. ఎందుకంటే ఒక 350 మిల్లీలీటర్ల డ్రింక్ బాటిల్ లో దాదాపుగా 35 నుంచి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. అందుకే మనము కూల్ డ్రింక్ తాగిన వెంటనే ఐదు నుంచి పది నిమిషాల్లో మన శరీరంలో దాదాపుగా 10 చంచాల షుగర్ వెళుతుంది. దీని వల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా   ఎక్కువగా పెరిగి పోతాయి. ఎంత పెరుగుతాయి అంటే మొత్తానికి సరిపోయే గ్లూకోజ్ ఒక్కసారిగా తయారవుతుంది.

సాధారణంగా మనము ఇంత షుగర్ తినలేము చాలామందికి కొద్దిగా షుగర్ తినగానే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇంత శాతం షుగర్ శరీరంలోకి ఒక్కసారి వెళ్లగానే దీనివల్ల మనకు వికారం మరియు వాంతులు వచ్చేలా అనిపిస్తుంది. కానీ కూల్ డ్రింక్ లో ఎంత శాతం షుగర్ ఉన్న కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఎప్పుడూ మనకు అలా అనిపించదు. ఎందుకంటే కూల్ డ్రింక్ లోపల ఎక్కువ మోతాదులో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూల్డ్రింక్స్ లోపల ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కూల్ డ్రింక్ తాగిన  20నిమిషాల తర్వాత మన శరీరంలో షుగర్ శాతం ఎక్కువగా పెరిగిపోతుంది. దీనిని తగ్గించడానికిమన శరీరంలో ఇన్సులిన్ శాతం బాగా పెరిగిపోతుంది. ఒక్కసారిగా ఇలా జరగటం వలన మన లివర్ దీనిని సక్రమంగా హ్యాండ్ చేయలేదు దీని వల్ల మన శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోయి షుగర్ అరిగిపోకుండా కొవ్వులా తయారయ్యి మన పొట్ట దగ్గర పేరుకుపోతుంది.

కూల్ డ్రింక్స్ లోపల సిగరెట్ టీ కాఫీ లో ఉండే కెఫిన్ ఉంటుంది. దీనివల్ల కూల్ డ్రింక్స్ తాగిన 40 నిమిషాల తర్వాత మన శరీరం దీన్ని పూర్తి శాతం అబ్జర్వ్ చేసుకుంటుంది. కెఫిన్ వల్ల కళ్ళలో ఉండే కనుగుడ్లు బాగా యాక్టివేట్ అవుతాయి టీ మరియు కాఫీ లాగా. ఇవి తాగడం వలన మనకు తొందరగా నిద్ర పట్టదు బద్ధకం పోయినట్టు అనిపిస్తుంది ముందు కంటే ఎక్కువగా ఆక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయడానికి లివర్ మన శరీరంలో ఇంకా కొంచెం షుగర్ రిలీజ్ చేస్తుంది.

కూల్ డ్రింక్ తాగిన 50 నిమిషాల తర్వాత శరీరంలో మన మెదడుని ఆనందపరిచే కెమికల్ అంటే dopamine శాతం బాగా పెరుగుతుంది. దీనివల్ల మనకు మంచి గా హాయిగా ఒక రకమైన ఆనందం సంతోషం వస్తుంది. ఇది సేం ఎలా ఉంటుంది అంటే సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నాషలా ఉంటుంది. దీనివల్ల మన మెదడు మనల్ని మళ్లీమళ్లీ కూల్డ్రింక్ తాగాలి అనిపించేలా చేస్తుంది. అలాగే కొద్దికొద్దిగా మన అవసరం గా మారిపోతుంది.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలు అంటే ఒక గంట తర్వాత ఇందులో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్యాల్షియం మెగ్నీషియం మరియు  జింక్ లాంటి అవసరమైన పోషక విలువలు ఇది మన చిన్నపేగుల లోకి తీసుకు వస్తుంది. దీనివల్ల కూల్ డ్రింక్ తాగితే గంట తర్వాత టాయిలెట్కు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల కూల్ డ్రింక్ తాగకు ముందు శరీరంలో ఎంత శాతం నీళ్లు ఉంటాయో మీరు మొత్తం కూల్ డ్రింక్ తాగిన గంట తర్వాత శరీరం నుండి పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి.

కూలింగ్ లోపల కెఫిన్ మరియు ఫాస్పారిక్ యాసిడ్ శాతం ఎక్కువ బదులు ఉండడం వలన మన శరీరంలో క్యాల్షియం మెగ్నీషియం మరియు జింక్ లాంటి మినరల్స్ తొందరగా తగ్గిపోతాయి. దీనివల్ల మన ఎముకలు తొందరగా బలహీనపడి పోతాయి. శరీరంలో ఒక్కసారిగా ఇంత ఎక్కువ  మోతాదులో పోషక విలువలు తగ్గిపోవడం వలన ఒక గంట తర్వాత పూర్తిగా అలసి పోయినట్టు అనిపిస్తుంది. శరీరంలో ఉండే నీటి శాతం పూర్తిగా తగ్గి పోవడం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి దాహం తీర్చుకోవడానికి తాగాలి అనిపించే కూల్డ్రింక్స్ మన శరీరాన్ని ఎంత వేగంగా డీహైడ్రేషన్ కి గురిచేస్తున్నాయో.

కూల్ డ్రింక్స్ మరియుసాఫ్ట్ డ్రింక్ తయారీ లో ఎలాంటి ప్రకృతి సిద్ధమైన పండ్లను ఉపయోగించరు మరియు అన్ని కూల్డ్రింక్స్ వెనకాల దీనిని చక్కగా రాస్తారు. అలాగే ఈ కూల్డ్రింక్స్ తాగడం వలన మన శరీరానికి ఎలాంటి అందుతాయా అంటే అలాంటివి ఏమీ ఉండవు. మన శరీరానికి పనికివచ్చే ఒక్క పోషక విలువ కూడా ఇందులో ఉండదు. దీనికితోడు దంతాలు మరియు ఎముకలు బలహీనపడటం బ్రెస్ట్ క్యాన్సర్ డయాబెటిస్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ తో పాటు కడుపులో అల్సర్ అసిడిటీ ఫ్యాటీ లివర్ హార్ట్ ఎటాక్ వంటి భయంకరమైన రోగాలు కూల్ డ్రింక్స్ ఎక్కువ మోతాదులో తాగడం వలన వస్తాయి.

కొంతమంది వీటిని అప్పుడప్పుడూ సరదాగా తాగుతారు కానీ కొంతమంది మాత్రం వీటి మీద పూర్తిగా ఆధారపడి పోయి తాగకుండా అస్సలు ఉండలేరు. ఎక్కువశాతం మనదేశంలో కూల్ డ్రింక్ తయారుచేసే కంపెనీలు విదేశీయులవే. కొన్ని మెడికల్ రీసర్చ్ ల ప్రకారం ప్రకారం ఎవరైతే ఎక్కువ కూల్డ్రింక్స్ తాగుతారు వారి శరీరం తో మిగతా వారి శరీరం పోలిస్తే ఉండాల్సిన పోషక విలువల శాతం చాలా వేగంగా అగ్గి పోతున్నాయని తెలిపింది. అంతేకాకుండా వయసు కంటే ముందుగానే చాలా మందిలో ముసలితనం వచ్చేస్తుందని తెలిపింది.

కావున కూల్ డ్రింక్స్ కొనడం అంటే మనకు మనమే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం లాంటిది. దీనిని మనం పొగాకు సిగరెట్ టీ కాఫీ లాగా ఒక హానికరమైన పదార్థాలు చూడాలి. ఎందుకంటే ఇది మన శరీరం మాత్రమే కాకుండా మన మెదడును కూడా పాడు చేస్తుంది. ఎవరైతే ఆల్కహాల్ లో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతారు అలాంటి వారికి లివర్ సిరోసిస్ అనే రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కూల్డ్రింక్స్లో ఉండే కెమికల్స్ మన శరీరంతో ఆల్కహాల్ తో కలిసి ఆల్కహాలు ఉండే చెడు ప్రభావాన్ని రెండింతలు ఎక్కువ పెంచుతాయి. ప్రతి ఒక్కరూ తమకు తమకు నచ్చిన ఆహారాన్ని తినాలి అనుకోవడంలో తప్పులేదు కానీ తినే ఆహారం మన శరీరానికి మంచి చేస్తుందో లేదా చెడు చేస్తుందో అని తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే మీరు తాగాలి అనుకుంటే పండ్లరసాలు మరియు పాలు లాంటివి తాగండి. కాఫీ కూల్ డ్రింక్స్ ఇలాంటివి చాలా తక్కువగా తాగండి. కుదిరితే పూర్తిగా తాగడం మానేయండి.

Leave a Comment

error: Content is protected !!