హలో ఫ్రెండ్స్ అరటిపండే కదా అని తేలిగ్గా తీసుకునే వారు దీని గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే లొట్టలేసుకొ ని మరీ లాగిస్తారు. అన్ని కాలాల్లోనూ చౌకగా దొరికి మధుర ఫలం అరటి పండు. దీనిలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉండటం వలన తక్షణ శక్తి లభిస్తుంది. ఒక సాధారణ అరటిపండులో 27గ్రాముల కార్బోహైడ్రేట్లు 3 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల సహజసిద్ధమైన చెక్కర ఉంటాయి. దీంతో మనకు 105 కేలరీల శక్తి వస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఆకలి వేసినప్పుడు అరటి పండు తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. భోజనం తినగానే అరటిపండును తినడం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండడం వలన బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది.
రోజూ రెండు అరటి పండ్లు తినడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరిగి అటు వ్యాధులు దరిచేరవు. క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ ను వృద్ధి చేయకుండా అడ్డుకునే శక్తి అరటి పండు ఉంది. అరటి పండులో ఉండే tryptophan అనే ఎమైనో యాసిడ్స్ శరీరంలో ప్రవేశించగానే సేరిటోనియన్ గా మారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే పడుకునే ముందు పాలు తాగి ఒక అరటిపండు తింటే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
కొంతమందికి ఎక్కువగా కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. అలాంటి వారు రోజు ఒక అరటి పండును తినడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. తరచూ అరటిపండును తినడం మన నాడీ వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాక తెల్ల రక్త కణాలు వృద్ధి అవుతాయి.
ప్రతి రోజూ మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఒక అధ్యయనం ప్రకారం మచ్చలున్న అరటిపండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయని రుజువైంది. తెలుసుకున్నారుగా అరటి పండు వలన కలుగు లాభాలెన్నో.. మీరు రోజూ ఒక అరటిపండు తిని ఆరోగ్యంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.
ముఖ్య గమనిక: ఈ వెబ్ సైట్ లో పెడుతున్న ఆరోగ్య విషయాలు ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు మనలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు అనే విషయం గమనించాలి.
Suits my body. I take two bananas regularly. Good for digestive tract.
అరటి పండు అద్భుతంగా గా వుంది