What happens if you eat cashews everyday

జీడిపప్పులో ఉండే ఈ సీక్రెట్ తెలిస్తే అప్పు చేసి మరీ తింటారు…….

మనందరికీ జీడిపప్పు అంటే చాలా ఇష్టం. అసలు జీడిపప్పు రుచి నచ్చని వారు అంటూ ఉండరు. ఇలాంటి జీడిపప్పును తినడం మొదలుపెడితే ఆపడం చాలా కష్టం. ఎటువంటి వంటకాలలో ఉపయోగించిన మంచి రుచిని అందిస్తూ ఉంటాయి. ఇలాంటి జీడిపప్పును తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని, గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది అని భయంతో చాలామంది వెనకాడుతూ ఉంటారు. కానీ ఇది ఒక అపోహ. ఈ జీడిపప్పును తీసుకోవడం వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు.

ఎందుకంటే జీడిపప్పు వృక్ష సంబంధం. జంతు సంబంధం పదార్థాలు అన్నిటిలో కొలెస్ట్రాల్ అనేది డైరెక్ట్ గా ఎక్కువగా ఉంటుంది. కానీ వృక్ష సంబంధమైన వాటిల్లో కొలెస్ట్రాల్ అనేది డైరెక్ట్ గా ఉండదు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ జీడిపప్పులో ఉండే ఫ్యాట్ కూడా సాచ్యురేటెడ్ ఫ్యాట్ కాదు. అన్ సాచ్యురేటడ్ ఫ్యాట్ ఈ ఫ్యాట్ వలన మన శరీరంలో ఎల్ డి ఎల్ అనగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వదు. దీనివలన హె చ్డి ఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఇన్ డైరెక్ట్ గా దీనివల్ల ఈ లాభం ఉంటుంది.

ఎవరైతే వ్యాయామాలు చేయకుండా ఎక్కువగా బరువు ఉన్నవారు ఎక్కువ జీడిపప్పు తినటం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు కాదు. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంటుంది. జీడిపప్పు ఎక్కువగా తినడం వలన ఈ జీడిపప్పులో ఉండే ఫ్యాట్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడం వలన అవి ఫ్యాట్ కింద మారే అవకాశం ఉంటుంది. అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారుచేసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా తయారైయేటట్లు చేస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా కష్టపడుతూ లేదా ఎక్సైజ్ చేస్తూ జీడిపప్పు తీసుకోండి.

ఈ విధంగా తీసుకుంటే అసలు ఏ రూపంలోనూ బాడ్ కొలెస్ట్రాల్ తయారు కాదు. గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే మీకు పెరుగుతుంది. ఇవి సులభంగా జీర్ణం కావాలి అంటే వేపుకొని తినడం కంటే నానబెట్టుకుని తినడం చాలా మంచిది. ఎప్పుడైనా ప్రయాణాలలో గాని కాలక్షేపానికి గాని వేపుకొని కారం మసాలా చల్లుకొని తినవచ్చు. కానీ కొలెస్ట్రాల్ రాదు అని తెలుసుకొని భయం లేకుండా ఇష్టపడి కష్టపడి తింటూ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. మరియు వీటిని నానబెట్టుకొని కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వీటిని చిన్న పిల్లలకు స్నాక్స్ రూపంగా అలవాటు చేయడం కూడా వారి ఆరోగ్యానికి మంచిది….

Leave a Comment

error: Content is protected !!