What Happens To Your Body When You Drink Almond Milk Every Day

బాదం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా!!

బాదం పాలు పోషకమైన, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది,  సాధారణంగా ఇందులో కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ ఇ మరియు విటమిన్ డి వంటి అదనపు పోషకాలు దాని పోషక శక్తిని పెంచడానికి దీనికి కలుపుతారు.

   కేలరీలు తక్కువగా ఉంటాయి

 బాదం పాలలో సాధారణ ఆవు పాలకంటే 80% తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే బరువు పెరుగుతామనే భయం ఉండదు. అధిక బరువు ఉన్నవారు రోజువారీ వాడకంలో ఆవు పాలకు బదులుగా బాదం పాలను తీసుకుంటే తొందరగా బరువు తగ్గవచ్చు. 

  చక్కెర తక్కువగా ఉంటుంది

 స్వచ్ఛమైన బాదం పాలలో చక్కెర తక్కువగా ఉంటుంది, ఇది  డయాబెటిస్ ఉన్నవారికి చాలా గొప్పగా దోహాధం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బాదం పాలను  నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ను పరిమితంగా తీసుకోవాలి.  

 విటమిన్ ఇ అధికంగా ఉంటుంది

 బాదంపప్పులో సహజంగా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది, ఇది రోజువారీ అవసరమైన విటమిన్ ఇ లో దాదాపు 37% ఔన్స్ బాదం పప్పులో లభిస్తుంది. అందువల్ల, బాదం పాలు కూడా విటమిన్ ఇ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే కేవలం స్వచ్ఛమైన బాదం పాలలోనే ఇంత మోతాదు లభ్యమవుతుంది.  విటమిన్ ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది శరీరంలో మంట మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.  అలాగే విటమిన్ ఇ మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇది మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు  అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 కాల్షియం సమృద్ధిగా ఉంటుంది

 పాలు మరియు పాల ఉత్పత్తులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో ఎముకలు పటిష్టంగా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. అయితే పాలు తీసుకొని వారు బాదం పాలు తీసుకోవడం వల్ల కాల్షియం ను భర్తీ చేసుకోవచ్చు.  అలాగే ఇది పగుళ్లు మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అదనంగా, గుండె, నరాలు మరియు కండరాల సరైన పనితీరుకు కాల్షియం అవసరం.

 విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది

 గుండె పనితీరు, ఎముక ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండటానికి విటమిన్ డి దోహాధం చేస్తుంది. సాధారణంగా విటమిన్ డి అనేది సూర్యరశ్మి  ద్వారా లభిస్తుంది. అయితే ఎండలోకి వెళ్లలేని వారికి బాదం పాలు మంచి ప్రత్యామ్నాయం.  విటమిన్ డి లోపం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, కండరాల బలహీనత, సంతానోత్పత్తి సమస్యలు మొదలైనవి చుట్టుముడతాయి. 

 ఇందులో లాక్టోజ్ ఉండదు.

తీసుకున్న ఆహారం  జీర్ణమయ్యేటపుడు మరింత చిన్న చిన్న మొత్తాలుగా లాక్టోజ్ విభజిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ క్రమపద్ధతిలో జరుగుతుంది. అయితే దీని  వల్ల  అసహనం కడుపు నొప్పి, ఉబ్బరం మరియు గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బాదం పాలలో లాక్టోజ్ ఉందదు. 

వేగన్ లు తీసుకోవచ్చు.

 జంతువులు  నుండి లభించే ఏ పదార్థం కూడా తీసుకోకుండా జీవనశైలి కొనసాగించే వారిని వేగన్ లు అంటారు. బాదం పాలు పూర్తిగా మొక్కల ఆధారితమైనది,  ఇది ప్రోటీన్ తక్కువగా ఉన్నందున ఎలాంటి భయం అక్కర్లేకుండా బాదం పాలు తీసుకోవచ్చు. 

చివరగా…

  బాదం పాలను నేరుగా విత్తనాలను గ్రైండ్ చేసి తయారు చేస్తారు మరియు పోషకాహారం కోసం పాలలో కలిపి హెల్త్ డ్రింక్ గా కూడా తయారుచేసుకుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి గొప్ప సంరక్షణ కూడా.  

Leave a Comment

error: Content is protected !!