What Happens To Your Body When You Drink Turmeric Water

ఇప్పటివరకు ఎవరూ చెప్పని పసుపు రహస్యాలు!!

పసుపు గురించి తెలుసుకోవడానికి కొత్తగా ఏముంటుంది అందరికీ తెలిసిన విషయాలే కదా అనుకుంటాం కానీ చాలా ఉంటుంది. మన పూర్వీకులు తెలివైన వాళ్ళు వాళ్లకు అన్నీ తెలుసు కాబట్టే, పసుపును మన రోజువారీ ఆహారంలో భాగం చేశారు. మరి పసుపు లో ఉన్న అన్ని మంచి ప్రయోజనాలు మనం పసుపు వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూడండి మరి.

◆పసుపు యాంటీబయటిక్. పసుపులో ప్రోటీన్ ఫైబర్ నయాసీన్ తో పాటు విటమిన్ సి, ఇ, విటమిన్ కె  ఇంకా క్యాల్షియం, పొటాషియం, కాపర్,ఐరన్ ,జింక్, ఇన్ని రకాల సహజసిద్ధ లక్షణాలు ఉంటాయి కాబట్టే, పసుపు గొప్ప ఔషదం అయింది.

◆పసుపు క్యాన్సర్ కి చాలా మంచి మందు. ప్రొస్టేట్ క్యాన్సర్ ని రాకుండా నివారించడంతో పాటు క్యాన్సర్ సెల్స్ ని చంపే శక్తి పసుపుకు ఉంది. రోజు వంటల్లో తగు మోతాదులో పసుపు ని వాడడం వల్ల ఎలాంటి క్యాన్సర్లు మన దరిచేరవు.

◆అలాగే పసుపు కీళ్లవాతానికి నొప్పులకు కూడా మంచి మందు. రుమాటయిడ్ అర్థరైటిస్ ఉన్నవాళ్లు పసుపు రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది.

◆మధుమేహం ఉన్న వారికి కూడా పసుపు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ నీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తుంది. పసుపులో మరో సుగుణం కూడా ఉంది. అధిక కొలెస్ట్రాల్ ను దాని ద్వారా వచ్చే గుండె జబ్బులను తగ్గిస్తుంది. పసుపు రోగ నిరోధక శక్తిని కూడా అధికంగా పెంచుతుంది.

◆పసుపు వల్ల ఉన్న మరో అద్భుతమైన ఉపయోగం ఏంటంటే మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లకి పసుపు మంచి మందు.  దగ్గు జలుబు కూడా పసుపును  నీళ్లను మరిగించి ఆవిరి పట్టడం వల్ల అదుపులో ఉంచుకోవచ్చు.

◆పసుపు చర్మానికి కూడా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది మొటిమలు నల్ల మచ్చలు, కళ్ళకింద డార్క్ సర్కిల్స్ మాయం చేస్తుంది. 1 టీ  స్పూన్ పసుపులో తగినంత పెరుగు వేసి పొడిచర్మం ఉన్నవారు అయితే కొంచెం ఆయిల్ కూడా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. 

◆ఇంకా పసుపు కాలిన గాయాలకి మచ్చలకి బిడ్డ పుట్టిన తరువాత తల్లులికి పోట్ట దగ్గర చర్మం వదులుగా అవుతుంది. అక్కడ చారలు ఏర్పడతాయి. వాటికి కూడా పసుపు మంచి మందులా పనిచేస్తుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో (పాలు అయినా పర్వాలేదు) పసుపును కలిపి అక్కడ అంతా పట్టించి ఒక అరగంట తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ఫలితం మీరే గమనిస్తారు కొన్ని రోజుల్లో.

◆ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని తాగేస్తే చాలా రోగాలకు నివారణ దొరుకుతుంది. అలా ఉట్టి పసుపు నీళ్లు తాగ లేకపోతే కొంచెం తేనె నిమ్మరసం వేసుకుని కూడా తాగిన అవే ఫలితాలు ఉంటాయి. పసుపు సర్వరోగ నివారిణి.

చివరగా…..

అందానికి అందం చర్మ సౌందర్యం ఆరోగ్యానికి ఆరోగ్యం  అన్ని గుణాలు కలగలిపిన పసుపు మనకి ఆనందకరం మరియు శుభప్రదం. సహజ సిద్ధమైన పసుపు లో ఉన్న ప్రయోజనాలు సుగుణాలు తెలుసుకున్నారుగా. మీరు కూడా ఇప్పుడే పసుపును మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!