What Happens To Your Body When You Eat Spicy Food

కారం ఎక్కువ తింటున్నారా ఆరోగ్యానికి పెనుభారమే……

మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, పులుపు ఈ మూడు తప్పనిసరి. 90% వంటకాలు ఈ మూడు రుచుల కలయికలోనే ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు కారం లేని వంటకానికి చప్పిడి కూడంటూ ముద్ర కూడా వేసేసారు. అయితే ఏ పదార్థంలో అయినా ఈ మూడు రుచులలో ఏదో ఒకటి ఎక్కువైనా తినాలంటే సమస్యనే. కొందరికి పులుపు ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొందరికి కారం ఎక్కువ ఉంటే నచ్చుతుంది మరికొందరు ఉప్పు ఎక్కువ తినేస్తుంటారు. అయితే తినే ఆహారంలో కారం ఎక్కువ ఉంటే చాలా మంది తాము కారం ఎక్కువ తినగలమని అదేదో ఘనకార్యం అయినట్టు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రాంతాలను బట్టి వారి ఆహారంలో ఈ ఉప్పు, కారాలు ఉంటాయి. కానీ కారం ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి పెనుభారం అనే విషయం ఎవరికి తెలియడం లేదు. కారం ఎక్కువ తినడం  వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఒకసారి చూడండి.

తల తిరుగుడు, కళ్ళు బైర్లు కమ్మడం, చీకట్లుగా కనిపించడం, తూలి పడిపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ కారం తిన్నపుడు కలుగుతుంటాయి. గొంతులో మండిపోతున్నట్లు అవుతుంది, ఒంట్లో వేడి పెరిగిపోయి జ్వరిజం వచ్చినట్టు లోపలి శరీరం వేడి కక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఒంట్లో బలం కోల్పోయినట్టు అనిపించడం వలన  మనిషి నీరసంగా నిస్త్రాణంగా కనిపిస్తాడు.

కారం అతిగా తినేవాళ్ళు కారాన్ని కంట్రోల్ లొ పెట్టుకుంటే వాతం నొప్పులు తగ్గుతాయి అయితే కారాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే  వతాహం వికారం చెంది అనేక వాత వ్యాధుల్ని ఉత్పత్తి చేస్తుంది.  శరీరంలో వణుకు, నెప్పులు, పోట్లు, కత్తితో కోసినట్టు, సుత్తితో కొట్టినట్టు అమితమైన బాధ, కాళ్ళూ, చేతులు మంటలు, పిక్కలు, వేళ్ళలో నొప్పులు వంటివి కారాన్ని అధికంగా తీసుకునే వారిలో కనిపించే లక్షణాలు.

 వాతము, వేడి రెండు కలిసి జబ్బులు పెరగడానికి కారణం అవుతాయి. అగ్నికి గాలి తోడైతే మంటలు వ్యాపించినట్టుగానే, శరీరమంతా వేడి ఎక్కువ అవుతుంది. 

 కారపు రుచి వల్ల కలిగే అనర్థాలు చాలా ఉన్నాయి కారమంటే  పచ్చిమిర్చి అని ఇక్కడ ఉదేశ్యం కాదు, కరంగా ఉండే ఏ పదార్థమైనా సరే మిరపకాయ లేదా ఎండు మిర్చి, లేదా ఎండు కారం ఏదయినా కారం చేసే చేటు గూర్చి ఆయుర్వేదం కొన్ని వాక్యాలు చెప్పింది ఒకసారి అవేంటో చూద్దాం.

◆ వ్యక్తిలోని రసవీర్య ప్రభావాలు కారం అధికంగా తీసుకుంటే నశిస్తాయి. అంటే చరిష్మా( కాంతి, మెరుపు) అనేది తగ్గిపోతుంది. ఈ విషయాన్ని చరకుడు, సుశ్రుతుడు కూడా తమ గ్రంథాలలో ప్రస్తావించారు.

◆మనసులో సంతోషం, ఉత్సాహం నశించిపోయి ఏర్పడే పరిస్థితిని “గ్లాని” అంటారు. నిరాశా నిస్పృహలు ఆవరించినట్టు వ్యక్తి నిస్తేజంగా తయారయిపోయిన వాళ్లలో చాలా శాతం ఎక్కువ కారం తినేవారు అయి ఉంటారు.

◆ శరీరావయవాలు  క్రమంగా శిథిలం అవుతాయి.  కాళ్ళు, నరాలు పట్టు కోల్పోయి శరీరం పటుత్వం తగ్గిపోతుంది. 

◆ కారం  అధికంగా తీసుకుంటే శరీరం శుష్కిస్తుంది. అంటే  శరీరంలో జవసత్వాలు కోల్పోయి బలహీనంగా  తయారవుతుంది. చాలా మంది చెప్పుకునే చురుకుదనం, ఆరోగ్యం అనేవి ప్రస్తుత సమాజ పరిస్థితులకు వ్యతిరేకం. ఎలాంటి శారీరక శ్రమ లేని ఈ కాలంలో కారం ఆరోగ్యం పాలిట యమపాశం అనే చెప్పుకోవాలి.

చివరగా…..

తీసుకునే ఆహారపదార్థాలు ఎపుడూ మనకు ఆరోగ్యాన్ని చేకూర్చాలంటే తప్పకుండా ఆహారంలో కారం తగ్గించుకోవాలి. కారానికి దూరం ఉండటమే ఈ సమస్యకు గొప్ప మందు.

Leave a Comment

error: Content is protected !!