ఉదయాన్నే ఇంకా వీలైతే తెల్లవారు ఝామున కడుపు నిండా నీళ్లు తాగమని వైద్యులు మరియు పెద్దలు చెబుతుంటారు. నిద్రలేవగానే నీళ్లను మొదటగా తాగాలని కూడా చెబుతుంటారు. అయితే ఈ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి.
ముఖం కడుక్కోకుండానే నీళ్లను తాగవచ్చా??
నీటికి బదులుగా జావ గానీ, పల్లారసాలు కానీ, సూప్ కానీ తీసుకోవచ్చా??
నీరు తాగగానే నడవడం, పరిగెత్తడం వంటివి చేయవచ్చా??
ఈ ప్రశ్నలకు చాలామంది పైవన్నీ చేయవచ్చని చెబుతారు. అయితే ఎందుకు తాగాలి??
◆ పొద్దున్నే నీటిని తాగడం వలన శరీరంలోని విషదోషాలు మూత్రం ద్వారా ఫిల్టర్ అయి బయటకు పోతాయి.
◆ మజ్జిగ మీద తేరిన పలుచటి తేటలో శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర మూడింటిని సమానంగా కలిపి మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపిన పొడిని కొద్దిగా కలుపుకుని తాగితే జీర్ణకోశవ్యాధులు, వాతవ్యాధులలో, ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది.
◆ నీళ్లు తాగిన వెంటనే వ్యాయామాలు చేయడం, రన్నింగ్, జాకింగ్ వంటివి చేయకుండా ఒక పధినిముషాల అనంతరం చేయడం ఉత్తమం.
◆ పేగులు లోపల ద్రవపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల విరేచనం సాఫీగా జరిగేందుకు దోహాధం చేస్తుంది.
◆ ఇంతనీరు తాగాలని ఎక్కడా కొలత చెప్పలేదు, తాగుతున్నపుడు సాధ్యమైనంత మేరకు తీసుకోవాలి. నీటిని కడుపు నిండా తాగినపుడు పై పొట్టలోని కడుపు, ఈ సోఫీగస్ మొదలైన భాగాలలో పెరిగిన ఆమ్లాలు ఈ నీటితో కలిపి పలుచగా అయ్యి పైత్యం, గ్యాస్, మంట వంటివి ఏర్పడకుండా ఉంటాయి.
◆ ఇలా నీటిని తీసుకోవడాన్ని వాటర్ థెరపీ గా చెప్పుకోవచ్చు, దీనిని చాదస్తంగా ఎపుడూ పాటించకూడదు.
◆ పేగు పూత, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు మొదలైన ఉదర సంబందిత వ్యాధులతో బాధపడేవారికి ఉదయం తీసుకునే నీళ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి.
◆ శరీరానికి అవసరమైన లవణాలను అందించే గొప్ప ఔషధం నీళ్లు. ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలను శుభ్రపరిచి వాటి పనితీరు మెరుగుపరుస్తుంది.
◆ ఉదయాన్నే తీసుకునే నీటిని గోరువెచ్చగా ఉండేలా చేసుకుంటే గొప్ప ఫలితం ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి ఈ ప్రక్రియ చాలా బాగా పని చేస్తుంది.
◆ పరగడుపున నీటిని తీసుకోవడం పేగులలోకి వెళ్లి పేగులు శుభ్రం చేస్తాయి. దీనివల్ల మనం రోజులో తీసుకునే ఆహారపదార్థాలు జీర్ణం కావడానికి జీర్ణాశయం శక్తివంతంగా తయారవుతుంది.
◆ ఉదయాన్నే తాగే నీటివల్ల మన మూత్రపిండాలు శుభ్రపడి విసర్జన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు దరిచేరవు.
◆ శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా నియంత్రించగలిగేది కేవలం నీరు మాత్రమే కాబట్టి ఉదయాన్ని నీటితో మొదలు పెడితే రోజంతా శరీరం సమతాస్థితిలో ఉంటుంది.
చివరగా……..
ఉదయాన్నే నీరు తీసుకోవడం అనేది మన రోజులో ప్రధాన భాగంగా చేసుకుంటే అంతర్గత ఆరోగ్యం మాత్రమే కాకుండా, చర్మ సంరక్షణ మరియు మచ్చలు, మొటిమలు వంటి వాటి నుండి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది