What Is Ankylosing Spondylitis Know the Symptoms

స్పాండైలోసిస్…. యమా డేంజర్. ఎందుకో చదివితే తెలుస్తుంది.

వెన్నెముక లోపల ఎముక భాగాలు దెబ్బతిన్నాయని అనడానికి వైద్య పరిభాషలో స్పాండైలోసిస్ అంటున్నారు.  వెన్నుపూసలో వచ్చే కీళ్ళవాతమే వెన్నెముకలో ఎముక భాగాలు దెబ్బతినడానికి కారణం అవుతుంది.  వెన్నుపాము మధ్యలో నరాలు నలిగిపోతూ మెడ నుండి నడుము కింద భాగం వరకు నొప్పి, తిమ్మిరితో పాటు,కాళ్ళు, చేతులు, నడుము, మెడ భాగాలకు సంబందించిన కండరాలు బలహీనపడి ఒత్తిడికి  గురవుతాయి. 

వెన్నుపూసల మధ్య మెత్తని ఎముక పదార్థం ఉంటుంది. ఇది వెన్ను పూసల్ని బంధించి ఉంచుతుంది. ఈ మెత్తని ఎముక పదార్థాన్ని డిస్క్ అని అంటారు.  ఈ డిస్క్ లు అణిగిపోవడం, పక్కకి జరగడం వంటి కారణాల వలన పై వెన్ను పూస, కింది వెన్నుపూస పై వాలిపోతుంది. ఈ స్థితిలో వెన్నుపూసల మధ్య నుండి వెళ్లే నరం వీటి మధ్య పడి నలిగి  మెడనొప్పి, తిమ్మిరి, కండరాల బలహీనత కలుగుతాయి. దీన్ని వైద్య పరిభాషలో సర్వికల్ స్పాండైలోసిస్ అంటారు. 

 ఈ స్పాండైలోసిస్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.  సర్వైకల్ అంటే మెడ కాబట్టి ఈ భాగంలో వస్తే  సర్వైకల్ స్పాండైలోసిస్ అని పేర్కొంటారు. అలాగే నడుము భాగంలో సమస్య వస్తే లంబార్ స్పాండైలోసిస్ అని అంటారు.

మెడ కండరాలు స్తంభించిపోయి, నొప్పితో అటూ, ఇటూ మెడను తిప్పలేకుండా భుజాలు, చేతుల్లోకి నొప్పి ప్రవహిస్తున్నట్టు అనిపించడం. తిమ్మిరి, సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించడం, స్పర్శ తెలియకపోవడం  చేతులు కదిలించలేని స్థితి, మానసిక ఆందోళనలు వంటి పరిస్థితులు చుట్టుముట్టి అయోమయంలోకి నెట్టేసె ఈ సమస్యకు కొన్ని జాగ్రత్తలు మన చేతుల్లోనే ఉన్నాయి అవేంటో చూద్దాం.

◆ మెడకు సరైన వ్యాయాయం ఇవ్వాలి. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా సున్నితమైన వ్యాయామాలు చేస్తూ మెడను బాధించే నొప్పిని మెల్లిగా తగ్గించుకోవచ్చు.

◆ తీసుకునే ఆహారపదార్థాలలో పులుపు, అల్లం, వెల్లుల్లి, మసాలా వంటివి తగ్గించుకోవడం, వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.

◆ ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్న వృత్తులకు అనుగుణంగా కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయవలసి వస్తోంది. ఇలాంటి వాళ్ళు కూర్చునే భంగిమ విషయంలో  జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. దీనివల్ల మెడ మరియు వెన్నుపూసకు ఫ్లెక్సీబిలిటీ వస్తుంది.

◆ ఉప్పును వేయించి వస్త్రంలో వేసి మెడకు కాపడం పెట్టడం మరియు ఆయుర్వేదంలో సూచించిన కర్పూర తైలం తో మర్దనా చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

◆ అతిగా ప్రయాణాలు చేయడం మనుకోవడం మంచిది. అలాగే మెడమీద ఒత్తిడి కలిగించే పనులకు, మరియు వ్యాయామాలకు దూరంగా ఉండటం. టీవీ లకు అతుక్కుపోయి గంటలు గంటలు చూడటం వంటివి తగ్గించాలి. 

చివరగా…..

ఈసమస్య మెడలో వచ్చినా, నడుము భాగంలో వచ్చినా జాగ్రత్త మాత్రం సమస్యకు లోనైన ప్రాంతాన్ని ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం మరియు నొప్పులను ప్రేరేపించే అలవాట్లు మానుకుని వాతాన్ని పెంచే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటమే ఉత్తమైన మార్గం.

Leave a Comment

error: Content is protected !!