What is Black Fungus Infection in C0vid-19 Patients

బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి ఎవరికి వస్తుంది? ఈ ఏజ్ లో వస్తోంది? ఎలాంటి పేషెంట్స్ కి వస్తుంది? పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

ఎంతో మందికి చాలా భయాన్ని కలిగించే విషయం అంటే బ్లాక్ ఫంగస్. ఇది ఎవరికి వస్తుంది, ఎలాంటి క*రోనా పేషెంట్ కి వస్తుంది. ఇది ఏ వయసు వారికి వస్తుంది. క*రోనా నుంచి రికవరీ అయినా అందరికీ వస్తుందా. ఫంగస్ వస్తే చనిపోవడం తప్ప మరో మార్గం లేదా ఎలాంటి మెడిసిన్స్ వాడాలి ఏ మందులు వాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెడికల్ గా దీన్ని ఆరోసీఎం అంటారు.రైనో ఆర్బిడో సెరిబ్రిల్ మ్యూకర్ మైకోసిస్.  ఇది ముక్కు, కన్ను, మెదడుపై పనిచేసి నాశనంచేసే ఫంగస్ అన్నమాట.

ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పేషెంట్స్ లో, వెంటిలేటర్పై ఉన్న పేషెంట్స్ లో, ఆక్సిజన్ పెట్టుకున్నట్టు వంటి పేషెంట్స్ లో, ఎవరికైతే శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో వారిలో, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో, ముఖ్యంగా క*రోనా పేషెంట్స్ లో ఫంగస్ దాడి చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇది రక్త నాళాల ద్వారా మెదడుకు చేరుతుంది. ముక్కు నుండి కంటికి కంటి నుండి మెదడుకి చేరి అవయవాలను నాశనం చేసే భయంకరమైన ఫంగస్ మ్యూకర్ మైకోసిస్. 

ఈ  ఫంగస్ వచ్చిందని ఎలా కనిపెట్టగలము. ఫంగస్ వచ్చిన వారిలో ముఖం నుండి ఒక రకమైన చెడు వాసన వస్తూ ఉంటుంది. ముక్కు మూసుకుని పోయినట్టు వుండడం, కన్ను ఎర్రగా అవడం, కంటిచుట్టూ నొప్పి, కంటి కింద వాచినట్లు ఉండడం అవుతూ ఉంటే, డయాబెటిస్ పేషెంట్లు అయితే తప్పకుండా అది బ్లాక్ ఫంగస్ ఏమో అని అనుమాన పడాల్సి ఉంటుంది. వెంటనే డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఒకవేళ అది బ్లాక్ ఫంగస్ అయితే అది చాలా త్వరగా వృద్ధి చెందుతూ మెదడుకు చేరుతుంది. అలా చేరకముందే మందులు వాడడం మంచిది.

 హాస్పిటల్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశం ఉంది.దీనికి వాడే మందులు కోసం ముందస్తు వెతుకులాట మానేసి ఈ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున వస్తే వెంటనే డాక్టర్ని కలిసి డాక్టర్ సలహాతో మాత్రమే మందులు వాడాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఐసీయూలో ఉన్న వారు, ఆక్సిజన్ పై ఆధారపడి ఉన్నవారు, తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్కు సంబంధించిన మందులు ఎక్కువగా అందుబాటులో లేవు గనుక వీలైనంత ప్రారంభదశలోనే డాక్టర్ని కలిసి  ప్రాణాలని రక్షించుకోవడం అవసరం.

Leave a Comment

error: Content is protected !!