what is correct age for marriage for woman

పెళ్లికళ ఎన్నేళ్లకు?? అమ్మాయిలు పెళ్లి చేసుకోవలసిన వయసెంత??

కాలం మారేకొద్ది అన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే అమ్మాయిల జీవితంలో కూడా. నాటి సతీ సహగమనాలు, బాల్యవివాహల నుండి నేటి మైనర్ బాలికల హక్కులు, మహిళా సాధికారత వరకు ఎన్నో మార్పులు. అవన్నీ మహిళను, మహిళా శక్తిని సమాజంలో పటిష్టం చేస్తూనే ఉన్నాయి. అయితే ఎంతటి మహిళ అయినా ఒక వ్యక్తికి భర్త కావాల్సిందే, ఒక ఇంటికి కోడలు కావాల్సిందే. అయితే అమ్మాయి పెళ్లి విషయం లో వయసు పరంగా ఇప్పటికీ కొందరు వాదిస్తునే ఉన్నారు. మరి అమ్మాయి వయసు ఎంత ఉండాలి పెళ్లినాటికి?? ఒక్కసారి విశ్లేషిస్తే…..

చదువు

ఒకప్పుడు ఆర్థిక స్థితి లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిలకు 18 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేసి పంపేసేవారు. అయితే ఇప్పుడు చదువు విషయం లో బోలెడు మార్పులు వచ్చాయి. కేవలం అమ్మాయిలే కాదు తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను చదివించడానికి ఆసక్తి చూపిస్తూ, కష్టపడి చదివిస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. కారణం అమ్మాయిలు అబ్బాయిలతో పాటు పోటీ పడుతూ అన్నింటిలో విజయాలను నమోదు చేయడం. 

ఆర్థిక ఆసరా

కొందరి పెళ్లిళ్లు అయ్యాక భర్తతో విభేదాలు వచ్చి విడిపోతే  బయటకు వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర ఉండలేక తమకంటూ సంపాదన లేక చాలా సతమతం అవుతుంటారు. అలాంటి వారిని తమ కాళ్ళ మీద తమను నిలబెట్టేది ఆర్థిక సంపాదన మాత్రమే. అందుకే ప్రతి ఆడపిల్ల చదువుకోవడం ఎంతో ముఖ్యం ఈ విషయం ఇప్పట్లో అందరికి తెలుసు.

మానసిక పరిపక్వత

పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన తరువాత పెళ్లి చేస్తే లోతుగా మనస్తత్వాలను పరిశీలించే అవకాశం ఉండదు అలాంటి అమ్మాయిలు కేవలం వంటింటి కుందేళ్లయి భర్త అత్తమామల మాటలు పడుతూ గృహహింసలో మురిగిపోతారు. అందుకే కనీసం డిగ్రీ లేదా పీజీ చేయడం వల్ల కొన్ని మనస్తత్వాలను అర్థం చేసుకోగలుగుతారు.

శరీరక మార్పులను అర్థం చేసుకోవడం

శరీరం, అవయవాలు వాటి విధి, పెళ్ళి తరువాత లైంగిక జీవితం గూర్చి ఒక అవగాహన, శారీరక పుష్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కనీసం 22-24 సంవత్సరాల వయసు ఉండాలి 

బాధ్యతలు

ఈ కాలం లో కేవలం ఒక బిడ్డతో తృప్తి పడుతున్న తలిదండ్రులు బోలెడు ఉన్నారు. ఆ ఒక్క బిడ్డ అమ్మాయి అయితే తల్లిదండ్రులకు బిడ్డ మీద ఎంతటి బాధ్యత ఉంటుందో బిడ్డ కూడా తల్లిదండ్రుల మీద అంతే బాద్యతతో స్థిరపడాలని అనుకుంటుంది. అలాగే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో అయితే

డిపెండెంట్స్ బాధ్యత, పెద్దవాళ్ళ ఆరోగ్య సమస్యలు, అక్క ల వదిన ల పెళ్లయ్యాక జీవితాలు పిల్లలు సంసారం సామాజిక బాధ్యతలు పిల్లల మనస్తత్వాలు త్యాగాలు, ఆధార పడడం, ఆసరాగా ఉండడం, మనస్పర్థలు, ఇగోలు, సర్దుబాట్లు, సరైన నిర్ణయాలు, తప్పు నిర్ణయాల నుంచి నేర్చుకోవడం, దిద్దుకోవడం, హెల్ప్ చేయడం, తీస్కొడం, ఇలాంటివన్నీ కూడా వయసు రీత్యా అర్థమవుతాయి కాబట్టి పెళ్లి విషయంలో అమ్మాయిల వయసు కనీసం 22 నుండి 24 సంవత్సరాలు ఉండాలి.

చివరగా

చాలా మంది లైఫ్ గోల్స్ పేరిట పాతికేళ్ళు దాటినా ఇంకా చదువు, పై స్థాయి అంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల  గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఉద్యోగం చేసుకోవడానికి డిగ్రీ లేదా పీజీ స్థాయి విద్యార్హత ఉంటే ఎలాంటి ఆలోచన లేకుండా పెళ్లికి సన్నద్ధం అవ్వచ్చు

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!