వంటల్లో వాడుకునేది ఉప్పు అని అందరికి తెలిసినదే, ఉప్ఫ లేని వంటను ఉహించుకోవడం తినడం చాలా కష్టం. అయితే ఉప్పు ను ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విషయం కూడా తెల్సు. ఉప్పులో అధికశాతం ఉండే సోడియం క్లోరైడ్ ఆహారానికి రుచిని ఇస్తుంది. అయితే ఈ సోడియం క్లోరైడ్ ఎక్కువ అవడం వల్ల శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకప్పుడు 33 ఉప్పును ఎక్కువగా వాడేవారు కాదు మరియు వాళ్ళు ఉప్పు లేని తిండి తిన్నారా అనే అనుమానం రావచ్చు. కాని ఎన్నేళ్ల కాలంలో నుండో ఉపయోగిస్తున్న లవణం వేరు ఉంది. అదే సైందవ లవణం. చెప్పడానికి ఆశ్చర్యంగా ఉన్నా సైందవ లవణం ఆహారంలో ఉప్పుకు బదులుగా వాడుకోవడం వల్ల కేవలం సహజమైన రుచి మాత్రమే కాదు గొప్ప ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. అలాంటి ఈ సైందవ లవణం గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలు చూడండి.
◆ సైందవ లవణం బలకరమైనది. ఇది శరీరంలో అవయవాలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అతి వేడి శరీరం కలవారు ఉప్పు కు బదులుగా సైందవ లవణం ను ఆహారంలో తీసుకోవడం వల్ల వేడి తగ్గి శరీర ఉష్ణోగ్రత సమతా స్థితిలో ఉంటుంది.
◆కంటి సమస్యలు ఉన్నవారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే దృష్టిదోషం క్రమంగా తగ్గుతుంది. అలాగే ఉప్పు వల్ల కలిగే బిపి ని నియంత్రించడంలో సైందవ లవణం అద్భుతంగా పనిచేస్తుంది.
◆ ఏలకులు రెండు భాగాలు, సైందవ లవణం మూడు భాగాలు, జీలకర్ర రెండు భాగాలు తీసుకుని వీటిని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఆవు పాలతో కలిపి తీసుకుంటే బాలింతల్లో లోపించిన పాలు తిరిగి వృద్ధి అవుతాయి.
◆ సైందవ లవణాన్ని ఏడు తమలపాకుల్లో వేసి మెత్తగా నూరి వేడినీళ్ళతో కలిపి తాగడం వలన కాళ్ళు ఉబ్బిపోయి ఇబ్బంది పెట్టె బోధకాలు సమస్య నివారణ అవుతుంది.
◆ అన్నం వార్చగా మిగిలిన గంజిలో ఇంగువ మరియు సైందవ లవణం కలిపి తాగిస్తే నెలలు నిండినా కూడా ప్రసవం కానీ వారికి ప్రసవం అవుతుంది.
◆ సాధారణంగా ఉప్పు వల్ల ఎదురయ్యే సమస్య అయిన రక్తపోటు ఎక్కువైనపుడు ఆహారంలో ఉప్పు తీసుకోవడం మనేయడమే కాకుండా సైందవ లవణం కు కూడా దూరంగా ఉండాలి. అయితే రక్తపోటు తిరిగి సాధారణ స్థాయికి వచ్చాక ఉప్పును వదిలేసి సైందవ లవణంను వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాకుండా రుచికి రుచి ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చివరగా…..
సైందవ లవణం గూర్చి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇది కేవలం ఆయుర్వేదంలోనూ మరియు సైన్స్ ప్రయోగశాలలో మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి దీన్ని తీసుకుని ఉప్పుకు బదులుగా వాడటం మొదలు పెడితే మీ శరీరంలో మార్పు మీరే నమ్మలేకపోతారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.