చెవి, ముక్కు, గొంతు మూడు ఇకదానికి ఒకటి అనుసంధానమైన అవయవాలు. వేటలో ఏ ఒకటి ట్రబుల్ ఇచ్చినా మిగిలిన రెండు కాస్త కుంటుపడతాయ్. మనం ముఖ్యంగా శ్వాసించాలన్నా, వాసన చూడలన్నా, ఒక పదర్గాన్ని ఆస్వాదించాలన్నా అది కేవలం ముక్కువల్లనే సాధ్యం. అలాంటి ముక్కు ట్రబులిస్తే. మన గుబులు అంతా ఇంతా కాదు. ముక్కుకు ట్రబుల్ తెచ్చి మనల్ని విలవిలలాడించే సైనసైటిస్ సమస్య ఈమధ్య కాలంలో అందరిని వేధిస్తోంది. ఈ సమస్య రావడానికి కాదనలు, దాని లక్షణాలు, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ఇవన్నీ మనకోసం.
సైనసైటిస్ అంటే??
మన ముక్కుల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఇవి వాపుకు గురికావడం వల్ల మన రోజువారీ పనులకు అడ్డంకి కలగడమే కాకుండా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వని స్థితిని ఈ సైనసైటీస్ కలిగిస్తుంది.
సైనసైటీస్ రావడానికి కారణం
◆చాలావరకు వాతావరణ మార్పులు ఈ సమస్యకు దారితీస్తుంటాయి. సీజనల్ మార్పులు ముఖ్యమైనవి.
◆ఇన్ఫెక్షన్లు
◆శ్వాసకోశ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల వ్యాధులు
◆ధూమపానం( స్మోకింగ్)
◆అలర్జీలు
◆జలుబు , దగ్గు నిర్లక్ష్యం చేయడం. పిప్పి పన్ను నొప్పి, టాన్సిల్స్ వల్ల దవడ మరియు గొంతులకు ఇరువైపులా వాపు రావడం.
◆పై వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధకాశక్తి తగ్గడం వల్ల సైనస్ సమస్య తీవ్రతను పెంచుకుంటుంది.
◆సైనసైటీస్ సమస్య లక్షణాలు
సాధారణంగా చాలా మంది సైనస్ వచ్చినా గుర్తించరు. సాధారణ జలుబు, జ్వరం అని సర్దిపెట్టేసుకుంటారు. అయితే ఇది కూడా వస్తుంది పోతుంది, కానీ దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం చుక్కలు చూపించి పరిస్థితిని పెద్దగా చేస్తుంది. అందుకే వీటి లక్షణాలు తెలుసుకోవడం ముఖ్యం.
లక్షణాలు
◆జ్వరం రావడం, రాత్రిపూట దగ్గు ఎక్కువగా ఉండటం.
◆నుదురు వేడిగా ఉండటం మరియు నొప్పిగా ఉండటం
◆ముక్కు నుండి పసుపు, తెలుపు లేక ఆకుపచ్చ రంగులో చిక్కటి ద్రవాలు రావడం.
◆మొహం ఉబ్బిపోవడం
◆మన శ్వాశ మనకు ఇబ్బంది కలిగించే రీతిలో దుర్గంధం వెదజల్లడం
◆ఆకలి లేకపోవడం
◆చెవినొప్పి వంటి లక్షణాలు మనం గమనించవచ్చు.
తీసుకోవలసిన ఆహారం
◆సైనస్ సమస్యకు చెక్ పెట్టాలంటే ముఖ్యంగా ఒమేగా3 కొవ్వు అమెలాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
◆అవకాడో లో ఒమేగా3 కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి
◆బీన్స్, పెసలు, కిడ్నీ బీన్స్(రాజ్మా) మొదలైనవాటిలో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి.
◆బీన్స్ మొలకల్లో కాల్షియం, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన టమాటా, బత్తాయి, నిమ్మ, ఆరంజ్ వంటి పళ్ళను తీసుకోవాలి.
◆సైనస్ లో తలనొప్పి తగ్గడం కోసం కాఫీని ఇష్టానుసారం తాగకూడదు. దానిబధులు గ్రీన్ టీ ను తీసుకోవాలి.
◆తేనె, నిమ్మరసం కలిపిన వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇది మ్యుకస్ ను తగ్గిస్తుంది. చాలా రిలీఫ్ ను ఇస్తుంది.
◆నీటిని బాగా తాగాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది.
◆బాగా మరిగించిన నీటిలో నీలగిరి తైలం, లేదా అమృతాంజనం వేసుకుని వేడి నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.
చివరగా……..
ఇన్ని చెప్పుకున్నాక ఇక సమస్య వచ్చినపుడు గుర్తించి తగిన సూచనలు పాటిస్తే సమస్య సులువుగా తగ్గిపోతుంది. ఈయహే డాక్టర్ ను సంప్రదించడం మాత్రం మానకండి సుమా…
జలుబు ఉంది కోల్డ్ ఎలర్జీ శీతాకాలంలో ఉంటుంది