హలో ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది అల్మొండ్స్ అదేనండి బాదం పప్పు.
ఈరోజు మనం ప్రతి రోజు ఎంత మోతాదులో మరియు ఎలా బాదం పప్పు తినాలో తెలుసుకుందాం. అలాగే వీటిని తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. బాదం పప్పు మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.
బాదంపప్పును సరైన మోతాదులో సరైన పద్ధతిలో తింటే ఇది మన శరీరం నుండి విషపదార్థాలను తొలగించి మన శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీ లో బ్లడ్ ప్రెజర్ కొలెస్ట్రాల్ డయాబెటిస్ మరియు గుండె సమస్యలు తగ్గించడానికి అలాగే కీళ్ల నొప్పులు మరియు క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యాల నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా మన చర్మానికి వెంట్రుకలకు మరియు బ్రెయిన్ పవర్ పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. బాదం పప్పు లో ప్రోటీన్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్, బయోటిన్, విటమిన్ E, మరియు హెల్తీ ఫ్యాట్స్ లాంటివి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఎంత మోతాదులో బాదం పప్పు తినడం తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రతిరోజు మీరు 10 నుండి 12 బాదం పప్పు మాత్రమే తినాలి అంతకుమించి ఎక్కువగా తినకూడదు. ఎవరైతే కొత్తగా బాదం పప్పులు తినడం స్టార్ట్ చేస్తారో అలాంటి వారు రోజు నాలుగు నుంచి ఐదు బాదం పప్పు తినడం మొదలు పెట్టి ఇలా రోజు రోజుకి కొద్దికొద్దిగా పెంచుకుంటూ తినాలి. అలాగే ఎప్పుడూ బాదం పప్పును నాన పెట్టుకొని మాత్రమే తినాలి. ఎందుకంటే ఇలా తినడం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకోసం మీరు రాత్రి నిద్రపోయే ముందు బాదంపప్పును నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటి పైన ఉండే పొట్టును తీసి వేసి తినాలి. ఇలా చేయడం వలన మీ శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది అంతే కాకుండా బాదంపప్పు సులభంగా అరిగిపోయి అందులో ఉండే పోషక విలువలు మీ శరీరానికి పూర్తి శాతం అందుతాయి.
ఇప్పుడు చెప్పిన మోతాదు కంటే ఎక్కువగా బాదం పప్పులు తింటే మన శరీరంలో ఫైబర్ శాతం ఎక్కువగా పెరిగిపోయి కడుపులో మలబద్ధకం కాన్స్టిపేషన్ సమస్య మొదలవుతుంది. బాదంపప్పులు చిన్నపిల్లలు పెద్ద వారు ఎలాంటి వయసువారైనా తినవచ్చు. ఎవరైతే కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారు అలాంటివారు బాదంపప్పును మాత్రం మాత్రమే కాకుండా ఎలాంటి డ్రైఫ్రూట్స్ అయినా తక్కువ మోతాదులో తినాలి. బాదంపప్పు మరియు మిగతా డ్రైఫ్రూట్స్ లో oxalate శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కిడ్నీ స్టోన్ సైజు ఇంకా ఎక్కువగా పెంచుతుంది.
బాదం పప్పులు తినడం ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా మంచిది. దీని వల్ల కడుపులో పెరిగే బిడ్డ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. అంతే కాకుండా ఇది మన జీర్ణ శక్తిని మన చర్మం యొక్క కాంతిని కూడా పెంచుతుంది. అలాగే మన కీళ్ల నొప్పులు కూడా తగ్గిస్తుంది. కంటి చూపును పెంచుతుంది మరియు మన మెదడు యొక్క పవర్ ను పెంచి మన జ్ఞాపకశక్తిని ఇంకా బలంగా చేస్తుంది.
మన శరీర బరువును తగ్గించుకోవడానికి మన శరీర బరువు పెంచుకోవడానికి బాదంపప్పును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
ఎవరైతే బరువును తగ్గించుకోవాలి అనుకుంటారు అలాంటివారు ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్ కు ముందు గాని ఖాళీకడుపుతో బాదం పప్పు తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే పుష్కలమైన ఫైబర్ మన శరీరంలో ఉండే మెటబాలిజంను రేటును పెంచుతుంది దీని వల్ల మన శరీరంలో ఉండే కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. అలాగే మన శరీరానికి ఎక్కువగా ఎనర్జీని ఇస్తుంది. దీనివల్ల మనకు ఎక్కువగా ఆకలి వేయడం తగ్గుతుంది. ఎవరైతే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ జిమ్ ఎక్సర్సైజ్ 30 నిమిషాల కంటే ఎక్కువ టైం చేస్తూఉంటారో అలాంటి వారు మాత్రమే ఎక్కువ మోతాదులో వర్కౌట్ 30 నిమిషాలు ముందుగా లేదా వర్కౌట్ చేసిన తర్వాత బాదం పప్పు తినాలి.
మనలో ఎవరైతే శరీర బరువును పెంచుకోవాలి అనుకుంటారో అలాంటి వారు పాలు బాదం పప్పు రెండు కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం మీరు ఒక గ్లాసు వేడి చేసిన పాలల్లో నాలుగైదు బాదం పప్పు వేసి అలాగే అందులో 47 గింజలు తీసివేసిన ఖర్జూరం వేసి వీటినన్నింటినీ రెండు గంటలు నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి బాదం ఖర్జూరం షేక్ చేసుకుని తాగితే ఇందులో ఉండే పోషక విలువలు రెండింతలు పెరిగి చాలా తొందరగా మీ శరీరం బరువు పెరుగుతుంది. బాదంపప్పును ఎక్కువశాతం నానబెట్టుకొని మాత్రమే తినండి. అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు బాదం పప్పులను డైరెక్టుగా తినండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి
బాదం పప్పు గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు