ఈ మధ్యకాలంలో మనుషులు బిజీ అయిపోయి వ్యాయామానికి లేదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి సరైన సమయం వెచ్చించలేకపోతున్నారు. దాని వలన వయస్సుతో సంబంధం లేకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యంగా జాయింట్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు శరీరంలో ఏర్పడటం ప్రతి ఒక్కరిలోనూ గమనిస్తున్నాం. వీటిని తగ్గించడానికి అనేక రకాల పెయిన్ కిల్లర్స్ వాడితే అప్పటికి ఉపశమనం లభిస్తుంది కానీ ఆ మందుల వల్ల దీర్ఘకాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాటి నుండి బయట పడటానికి మనం ఇంట్లోనే కొన్ని రకాల చికిత్సల ద్వారా నొప్పులు తగ్గించుకోవచ్చు.
వీటి వలన ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు మరియు సహజమైన ఈ చిట్కాలు వలన శాశ్వతంగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం మనం ఒక పింక్ కలర్ ఉల్లిపాయను తీసుకోవాలి. తెల్ల ఉల్లిపాయలు ఈ చిట్కా కోసం పనికిరావు. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు ఆవాల నూనె వేసుకొని దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఒక ఐదు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ రంగు మారి దానిలోని గుణాలు నూనెలోకి వస్తాయి. ఇప్పుడు నూనె చల్లారనిచ్చి ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. మీకు నొప్పి అధికంగా ఉంటే అర స్పూన్ పసుపు కూడా కలుపుకోవచ్చు. ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ నెమ్మదిగా మసాజ్ చేయాలి.
ఇలా చేయడం వలన శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఉల్లి మంచి యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు కలిగి ఉంటుంది. మీ ఆహారంలో ఎక్కువ ఉల్లిపాయలను జోడించడం వల్ల శరీరంలో మంట వల్ల కలిగే మీ RA నొప్పిని తగ్గించవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు మరియు లీక్స్‌లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది ఆస్పిరిన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి తాపజనక రసాయనాలను నిరోధిస్తుంది.
మోకాలి నొప్పి, నడుము నొప్పితో సహా మీ శరీరంలోని అన్ని రకాల రోగాలను నయం చేయడంలో ఆవనూనె ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది మోకాలి చుట్టూ ఉన్న సిరలలో రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు కండరాలు మరియు కీళ్లలో పట్టేయడం నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాతో పాటు ఆహారంలో పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం, రోజూ ఒకే చోట కూర్చొని ఉండకుండా నడవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వలన ఈ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. యోగా ద్వారా నొప్పుల నుండి బయటపడవచ్చు.