ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య నరాల వీక్నెస్. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో ఉన్నంత బలం వ్యక్తి 50 ఏళ్ల 40 ఏళ్ల వయసు పెరిగేకొద్దీ కనిపించడం లేదు. ఎప్పుడో 90 ఏళ్ల వయసులో రావాల్సిన నరాల వీక్నెస్ చిన్న వయసులోనే వచ్చేస్తోంది. ఈ వీక్నేస్ వస్తే ఏ పని చేయాలన్నా మనిషికి బలం కావాలి. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉండవలసిన వ్యక్తిలో ఇప్పుడు మనం తినే ఆహారం వలన నరాల వీక్నెస్ ఏర్పడుతుంది.
మన ఏ తప్పు చేయడం వలన నరాలు వీక్ అవుతాయి. దానిని సరి చేసుకొని మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మన ఆహారంలో చేస్తున్న పెద్ద తప్పు పాలిష్ పట్టిన తెల్లటి ఆహారాలు తీసుకోవడం. ఇవే నరాల వీక్నెస్కు ప్రధాన కారణం. తెల్లటి ఆహారం నరాల వీక్నెస్ కు కారణం అవుతుంది. బి విటమిన్లు నరాల పోషణకు చాలా ముఖ్యమైనవి. బి కాంప్లెక్స్ విటమిన్ ఆహార ధాన్యాల పై పొరల్లో ఉంటాయి.
ధాన్యాలు విత్తనాలలో పై రెండు పొరలలో ఈ విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ధాన్యాలలోని పై పొరలో ఉండే బి కాంప్లెక్స్ అధిక బలం. మన పూర్వీకులు అన్నాన్ని ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యంగా ఉండేవారు. దానికి కారణం దంచుకున్న బియ్యంలో పై పొరలు ఉండి దాని ద్వారా బి కాంప్లెక్స్ పుష్కలంగా లభించేది.
మన పెద్దవాళ్ళు ఎప్పుడూ విటమిన్ టాబ్లెట్స్ వాడేవారు కాదు. రోజూ పండ్ల రసాలు, మొలకలు కూడా తినేవారు కాదు కానీ వారు చాలా బలంగా ఉండడానికి వారు తిన్న ఆహారమే కారణం. పాలిష్ పట్టని ధాన్యం బియ్యం తినే వారు పాలిష్ పెట్టడం వల్ల ధాన్యాలపై ఉండే పై పొరలు రెండు పోతాయి. ఈ పై పొరలోనే బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
తెల్లటి ఆహారాలు అంటే పంచదార, మైదా, పాలిష్ పట్టిన బియ్యం వంటివి దూరం పెట్టాలి. ఇవి స్లో పాయిజన్లా పని చేసి ఆరోగ్యం నాశనం చేస్తుంది. పాలిష్ పట్టని పప్పులు పొట్టు కందిపప్పు, పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు వంటివి ఉపయోగించుకోవాలి. తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బియ్యం మిల్లులో ఈ తవుడు లభిస్తుంది.
దానిని తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. తినగలిగితే రోజుకి కొంత ఖర్జూరం వంటి వాటితో కలిపి తినవచ్చు లేదా చపాతి పిండిలో కలిపి రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తవుడు నానబెట్టి మూడు గంటల తర్వాత నీటిని వడకట్టి ఆ నీటిని తాగవ్వచ్చు. దీని వలన కూడా విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది.