మానసికంగా ఒత్తిడి తగ్గించడానికి అశ్వగంధ రెండు కోణాల్లో ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. 2021 వ సంవత్సరంలో 60 మంది మీద పరిశోధనలు చేసి ఓరిగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు స్పెషల్ గా అశ్వగంధ పై నిరూపించడం జరిగింది. ఈ అశ్వగంధలో పది రకాల అడాప్టోజేన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని ఆంటీ స్ట్రెస్ గా పిలుస్తారు. ఈ పది రకాల అడాప్టోజెన్స్ ఆంటీ స్ట్రెస్ గా బ్రెయిన్ పై పనిచేస్తాయి.
అశ్వగంధ మొట్టమొదటిగా స్ట్రెస్ ను తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన మనలో మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ ఇటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కాటిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని అంటారు. ఈ కాటిజాల్ అనే హార్మోన్ అంత ఎక్కువగా రిలీజ్ అయితే మనలో స్ట్రెస్ అంత ఎక్కువగా అవుతుంది. గుండె వేగం, ఊపిరితిత్తుల వేగం పెరిగిపోతుంది. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయి, బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వీటి వలన అనేక హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి.
ఈ స్ట్రెస్ హార్మోన్ అయినా కార్టీజాల్ తగ్గించడానికి అశ్వగంధ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కార్టీజాల్ ఎక్కువగా ఉత్పత్తి చేసే రెండు రకాల ప్రోటీన్స్ తగ్గించడమే అశ్వగంధ చేస్తుంది. ఇంకా రెండో విధంగా చూస్తే హెచ్ పి ఏ ఆక్టివేటర్స్ ఇలాంటి వాటి చోట రిలీజ్ అయ్యే స్ట్రెస్ హార్మోన్స్ ను తగ్గించి పారా సింపాథీక్ నరాల యొక్క యాక్టివిటీని స్టిమ్యూలేట్ చేసి పెంచి మెదడుకు రిలాక్సేషన్ కలిగించడానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన ఈ రెండు కోణాల్లో స్ట్రెస్ తగ్గడానికి, డిప్రెషన్ కు లోను కాకుండా, డిప్రెషన్ పెరగకుండా ఉండడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది.
శారీరకంగా బలంగాను, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది అని మనందరికీ తెలుసు. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి ఒత్తిడి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలి అంటే అశ్వగంధ వేల పొడిని తీసుకొని ఉదయం ఒక టి స్పూన్ తీసుకుని పాలలో కలుపుకొని తాగవచ్చు. మరల సాయంత్రం పూట కూడా నీళ్లలో కలుపుకొని కూడా తాగవచ్చు. రోజుకు రెండు పూటలా కలిపి పది పదిహేను గ్రాముల అశ్వగంధ పొడిని తీసుకుంటే ఈ విధమైన లాభాలు మనకు కలుగుతాయి.