What is the Right Age For Marriage

30 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకోవచ్చా?? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి!!

వివాహ బంధం అరుదైన అనుబంధం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం ఎంతో విశిష్టతను కలిగివుంది. మూడుముళ్లు ఏడు అడుగులు ముచ్చటైన జంటలు ఇప్పట్లో ఎక్కడా??

జీవితం వివాహం అన్న మాటలతోనే ప్రారంభం అవుతుంది కాని ,ఈ మధ్య కాలంలో వివాహాం అనగానే అబ్బో ! పెళ్ళా చూద్దాం అన్న మాటలు వస్తున్నాయ్. దానికి కారణం అటు అబ్బాయికి ఇటు అమ్మాయికి గొంతెమ్మ కోర్కెలు ఉంటడం. ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోరు. ప్రస్తుత కాలంలో  అబ్బాయి కి సంబంధాలు కుదిరే సరికి 45 సంవత్సరాలు, అమ్మాయికి 40సంవత్సరాలు ఆవుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇంతా అయ్యాక ఇప్పుడు మాకు ఇంకా పెళ్లి ఎందుకు అనే మాట వినపడుతుంది. దీనికి కారణం ఇరువురి మధ్య ఉన్న ఇగో లే కారణం. అబ్బాయి ఏమో అమ్మాయి నేను చెప్పినట్టు వినాలి నాకంటే తక్కువ స్థానంలో ఉండాలి అనుకుంటాడు, అమ్మాయి ఏమో అబ్బాయి అందంగా ఉండాలి అన్నట్టు ఉండడం అదే విధంగా అమ్మాయి ల విషయం లో అబ్బాయి కి సంపాదన బాగా ఉండాలి అందగా ఉండాలి నా వయసు సరిపోయే విధంగా ఉండాలి అని అన్నివిధాల ఆలోచించే సమయానికి ఉన్న వయసు కాస్త ముగిసి పోతుంది. అప్పుడు ఇక మాకు పెళ్లి ఎందుకు పెళ్ళి లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి మాకు పిల్లలు ఎందుకు?? అనే ఆలోచనలు కలుగుతాయి.

మరి కొంత మంది మాకు పెళ్లి ఎందుకు మా దగ్గర చాలా డబ్బు ఉందని అదే డబ్బు మా అవసరాలు తీర్చగలదని ఆలోచిస్తారు కానీ అది చాలా తప్పు ప్రేమ అనురాగం ఆప్యాయతలను డబ్బు ఇవ్వదని గ్రహించలేక పోతున్నారు యువత. ఏదన్నా కాస్త జబ్బు చేస్తే మనకు ఒక్క తోడు కావాలని అనిపిస్తుంది ఎవరైనా ఒక్క గ్లాస్ మంచినీళ్లు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటిది జీవితం అంతా సోలో గ ఎలా ఉండగలరు.

ఒక వైపు తల్లితండ్రలిద్దరూ బాధ పడుతుంటే చూడలేక తమంతట తాము మనసులోనే కృంగిపోతారు అలా అని వివాహం చేసుకొరు. తల్లితండ్రలిద్దరూ ఎన్ని రోజులు ఉంటారు. వారు మరణించిన తరువాత ఒంటరి జీవితాన్ని అనుబాభవించాల్సి వొస్తుంది. ఒంటరి జీవితం చాలా భయంకరంగా ఉంటుందని ఆలోచించరు డబ్బు ప్రేమను పంచదు కాబట్టి అన్ని విధాలా ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేసి పెద్దలు చెప్పినట్టు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే మంచిదన్నట్టు.  వివాహం చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆశిస్తున్నాం

Leave a Comment

error: Content is protected !!