పల్లెటూరులో వాడే దుస్తులు సాంప్రదాయాలు దుస్తులు లుంగీ, పైజామా మనందరం ధరించే వాళ్ళం. పట్టణాల్లో పెరిగే వారంతా కూడా డ్రాయర్, అండర్వేర్ అనేది కంపల్సరీ వేసుకొని పైనజీన్స్ ఫాంట్స్ వేసుకుంటారు. ఎక్కువ గంటలసేపు అండర్ వేర్ వేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఈ రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి ఈ విషయం కూడా కారణం అని చెప్పాలి. పిల్లలు పుట్టకపోవడానికి, వీర్యకణాలు ఉత్పత్తి తగ్గడానికి, వీర్యకణాల క్వాలిటీ తగ్గడానికి, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గడానికి ఈ సమస్యలన్ని అండర్ వేర్ వాడటం వలన వస్తున్నాయి.
ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి టెంపరేచర్ 98.4 ఫారెన్ హీట్. ఇది నార్మల్ టెంపరేచర్ కాబట్టి ఆ వ్యక్తి హెల్తీగా ఉన్నాడని నిర్ధారణ చేయాలి. చల్లగా ఉన్నపుడు టెంపరేచర్ 93. 47 డిగ్రీల 90 డిగ్రీస్ మధ్యలో ఉన్నప్పుడే ఇది అనుకూలమైన టెంపరేచర్ అని సైంటిఫిక్ గా ఉంది. మగవారి అనుభవంలో చూస్తున్నాం. అండర్ వేర్ వాడటం వలన స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గడం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు రావడం జరుగుతుంది. చల్లగా ఉన్నపుడు వృషణాలు లూసుగా వేలాడి ఉంటాయి. వీర్యకణాలు ఉత్పత్తి జరగాలంటే వృషణాలకు తగినంత టెంపరేచర్ ఉండాలి.
టెంపరేచర్ కర్రెక్టుగా ఉన్నప్పుడు వీర్యకణాల ఉత్పత్తి, క్వాలిటీ అనేది బాగుంటుంది. వృషణాలు వేడిగా ఉన్నపుడు దగ్గరకి కుసించుకుని ఉంటాయి. చల్లగా ఉన్న వాతావరణంలో ఉన్నవారు అండర్ వేర్ వాడొచ్చు.కానీ మనది వేడిగా ఉండే వాతావరణం ఇక్కడ అండర్ వేర్ వేసుకోవడం వలన వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఒకవేళ బయటకి వెళ్ళినపుడు వేసుకున్న ఇంటికి రావడంతోనే తీసేసి సంప్రదాయ దుస్తులు లుంగీ, పైజామా వేసుకోవాలి. పూర్వం అండర్ వేర్ వాడేవాళ్లు కాదు. అందుకే పిల్లలు లేకపోవడం అనే సమస్య ఒకరు ఇద్దరికీ తప్ప ఎక్కువగా వినిపించేది కాదు.
ప్రస్తుతం పట్టణ వస్త్రధారణ అందరికి అలవాటు అయిపోయి అండర్ వేర్, పైన దళసరిగా ఉండే జీన్స్ ఫాంట్ వేసుకుని రోజులో ఎక్కువ సమయం అలానే ఉండిపోతున్నారు. ఇంకా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య పెరిగిపోతుంది. అంతే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. అందుకే కాళ్లు విడదీసి కూర్చోవాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం వలన వృషణాలు నొక్కినట్లు అయిపోతాయి. గాలి తగిలేలా దుస్తులు ధరించాలి. మీక్కూడా అండర్ వేర్ వేసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.