what should we do after having food Dr Arjun Reddy

అన్నం తిన్న తర్వాత వాకింగ్ కి వెళ్లాలా లేదా పడుకోవాలా? Dr Arjun Reddy

మన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం యొక్క పని ఏమిటంటే ఎక్కడ పని ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్లిపోయి తనపని చేస్తూ ఉంటుంది. దాదాపు 70-80% రక్తం ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి పోతుంది. ఉదాహరణకి మనం వాకింగ్ చేసేటప్పుడు కాని జాగింగ్ చేస్తున్నప్పుడు కాని ఎక్కువ మోతాదులో రక్తం మన కాళ్ళలో చేతుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన రక్తంలో నుండి ఆక్సిజన్ విటమిన్స్ మినరల్స్ కాళ్లకు చేతులకు అందిస్తాయి. దీని ద్వారా మనము వాకింగ్ జాగింగ్ సులువుగా చేసుకోవచ్చు. అదే మనం పడుకున్నప్పుడు మన రక్తం కాళ్ళలో గాని చేతుల్లో కానీ బ్రెయిన్లో కానీ ఉండదు. పడుకున్నప్పుడు మన శరీరం కింది భాగంలో సమానంగా చేరిపోతుంది.

మరి తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే.. మనం తిన్నప్పుడు పని ఎక్కువగా జీర్ణాశయంలో  ఉంటుంది. అందువలన రక్తం ఎక్కువగా అక్కడికి చేరుతుంది. దాదాపు మూడున్నర లీటర్ల రక్తం మీరు తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి మన  పొట్ట చుట్టూ చేరుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే అక్కడ జీర్ణాశయానికి సంబంధించిన కండరాలు ఉత్తేజంగా పనిచేసి తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ మన రక్తం లోకి తీసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి తిన్న తర్వాత కొద్దిగా మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలోని ఎక్కువ శాతం రక్తం మీ బ్రెయిన్ నుండి  చేతులు కాళ్ల నుండి  పొట్ట చుట్టూ చేరుతుంది. అప్పుడు మీకు కొద్దిగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఒక పది నుంచి ఇరవై నిమిషాలు సంతోషంగా పడుకోండి. దీని ద్వారా మీరు తినే ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. తిన్న తర్వాత లేచి వాకింగ్ చూసి మీ డైజెస్టివ్ సిస్టం మీద ఒత్తిడిని తీసుకురాకండి. పూర్తి వివరాలకు పై వీడియో చూడండి… 

Leave a Comment

error: Content is protected !!