చేపలను తినడం వలన శరీరానికి అనేక లాభాలుంటాయి. ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాంటి చేపలంటే మాంసాహార ప్రియులకు చాలా ఇష్టం. కానీ చేపలు తినేటప్పుడు చేపలోని ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఇబ్బంది పెడతాయి. వాటికి భయపడి చాలా మంది చేపలు తినడం మానేయడం లేదా పిల్లలకు పెట్టడానికి భయపడతారు. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ముళ్ళు బయటకు వచ్చేస్తాయి.
ముళ్ళు గొంతులో గుచ్చుకోగానే పొట్టమీద గట్టిగా ఒత్తమనాలి. అప్పుడు గాలితో పాటు ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తుంది.
ఒకవేళ పొట్టలోనికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. పొట్టలో ఉండే జీర్ణరసాలలో ఉండే యాసిడ్స్ కరిగించేస్తాయి. అలాగే వంగొని వీపు మీద తట్టమనాలి. అలా తట్టినపుడు నోరు తెరిచే ఉంచాలి. చేపముళ్ళు గొంతులో ఇరుక్కున్న వెంటనే పొడి అన్నం ముద్దలా చేసి నమలకుండా మింగేయాలి. తర్వాత ఒక గ్లాసు మంచినీరు తాగేయాలి. ఇలా చేయడం వలన ముళ్ళు గొంతునుండి ఆహార వాహికలోకి వెళ్ళిపోతుంది.
అలాగే ఇంకో చిట్కా వచ్చేసి అరటిపండు. అరటిపండుని నమలకుండా సగం ముక్క కొరికి మింగేయాలి. తర్వాత కొద్దిగా నీరు తాగాలి. అలాచేయడం వలన కూడా ముళ్ళు గొంతునుండి తొలగిపోతుంది.
గుప్పెడు పల్లీలను నమిలి మింగేసిన మంచి ఫలితం ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాసి ముక్కలుగా కొరికి మింగేయాలి.
ఇంకో ప్రభావవంతమైన చిట్కా ఏంటంటే వెనిగర్. వెనిగర్ అనేది ఒక ఎసిడిక్ లిక్విడ్. దీన్ని మనం తీసుకున్నప్పుడు ఇది ముళ్ళును శరీరంలోనికి పంపిస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ నీటిని రెండు చెంచాలు మాత్రమే తాగాలి. అలాగే డాక్టర్స్ దగ్గరకు వెళితే వాళ్ళు చెప్పేది కార్బొనేటేడ్ డ్రింక్స్. అంటే సోడాలులాంటివన్నమాట.
ముళ్ళు ఇరుక్కున్న వెంటనే ఒక సోడా తాగితే సోడాలోని వాయువు గొంతులోని ముళ్ళుపై ఒత్తిడి తెచ్చి ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఈ చిట్కాలతో పాటు చేపలను తినేటప్పుడు జాగ్రత్తగా, కంగారు లేకుండా తినండి. చేపలను అన్నం ఉన్న ప్లేట్ లో కాకుండా వేరే ప్లేట్లో పెట్టుకుని తినాలి. పిల్లలకు నేరుగా ఇవ్వకుండా ముళ్ళు తీసివేసి ఇవ్వాలి. అలాగే ఈ చిట్కాలు వలన ప్రయోజనం లేనప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. లేదంటే పెద్ద సమస్యలుగా మారొచ్చు.