ప్రస్తుత ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆరోగ్య అలవాట్లు మానసిక ఒత్తిడి ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ను ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే జుట్టు పెరగదు అనుకున్న వారికి కూడా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక గుప్పెడు మెంతులు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి.
ఉదయాన్నే ఈ మెంతులు నీటితో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి. మెంతులు జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టుకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో అద్భుతంగా సహాయపడుతాయి. మెంతులు తలలో వేడి కూడా తగ్గిస్తాయి. కరివేపాకులు బీటాకెరోటిన్ ఉంటుంది ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి చుట్టూ ఒత్తుగా పొడవుగా పెరగడం సహాయపడుతుంది.
కరివేపాకు హెయిర్ కి మాత్రమే మాత్రమే కాకుండా ఆహారంలో కూడా తరచు తీసుకోవడం చాలా మంచిది. తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతులు కరివేపాకు ఫేస్ట్ లో రెండు లేదా మూడు చెంచాల పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత పొడి జుట్టుకు మాత్రమే ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. నూనె తలకు అప్లై చేసుకోకూడదు. ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత అరగంట పాటు ఆరనివ్వాలి.
తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా కుంకుడుకాయ లేదా శీకాకాయతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మాడుపై ఉండే చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఒక వారం రోజులు ఉపయోగించే సరికి మీ జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ చిట్కా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. దీనిలో వాడినవి అన్నీ నాచురల్ ఇంగ్రిడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు రాలడం సమస్య తో ఎక్కువ బాధపడే వారు ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. తేడా చూసి మీరే ఆశ్చర్యపోతారు.