బెల్లం పురాతన కాలంనుండి తీపికోసం వంటల్లో ఉపయోగిస్తుంటాం. అలాంటి బెల్లాన్ని ఉదయాన్నే తిని దానితో పాటు గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడంవలన మన శరీరంలో ఎన్నో రోగాలను నయంచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీర పనితీరును మెటబాలిజం రేటును వృద్ధి చేస్తుంది. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి1,బి6,సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేలరీలను కరిగించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు బెల్లం తిని వేడినీరు తాగడంవలన అద్బుతమైన ఫలితాలు చూస్తారు. ఈ రెండింటి కలయిక కిడ్నీలలోని రాళ్ళను కరిగిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ లింక్ చూడండి
అలాగే చర్మసమస్యలు కలవారు పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలు, చర్మం పాలిపోయి కాంతిని కోల్పోయిన వారుకూడా ఉదయాన్నే పరగడుపున బెల్లం తిని నీరుతాగడం వలన రెట్టింపు కాంతివంతంగా మారతారు.అలాగే చర్మాన్ని ఆరోగ్యం గా మార్చుతుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట బెల్లం తిని గోరువెచ్చని నీటిని తాగడంవలన ఉదయానికి మంచి రిలీఫ్ ఉంటుంది. నిద్రలేమి లేదా నిద్రలో గురకతో బాధపడుతుంటే కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. బెల్లం యాంటీ ఆటిజం ఏజెంట్ గా పనిచేస్తుంది. బెల్లం నిద్రను రప్పించడంతో పాటు మనసుకు ప్రశాంతతనిచ్ఛి నిరాశ నిస్పృహలను తగ్గిస్తుంది.చక్కెర బదులు బెల్లం ఉపయోగించవచ్చు. ఎందుకంటే చక్కెర వలన ఉపయోగం ఏమీ లేకపోగా బెల్లం కంటే ఎక్కువగా కేలరీలను కలిగి ఉండి అధికబరువు సమస్య కు కారణమవుతుంది.
స్వీట్లు తయారు చేసేటప్పుడు చక్కెర బదులు బెల్లం వాడటం మంచిది. బెల్లం వలన దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే చక్కెరవలన పంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లంతో పాటు యాలకులు కలిపి తినడం నోటిదుర్వాసన, నోటిలో ఏర్పడే బాక్టీరియా దూరమవుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ వలన రక్తహీనత, ఎనీమియా తగ్గి రక్తం స్థాయిలు పెరుగుతాయి. దీనిలో ఉండే కాల్షియం వలన ఎముకలు బలంగా ఉండడంవల్ల పిల్లలు ధృడంగా తయారవుతారు. బెల్లం శరీరంలో డీటాక్స్ చేసి కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. జింక్, విటమిన్ సి పుష్కలంగా ఉండి జలుబు, దగ్గులకు గురికాకుండా చూస్తుంది. మొత్తానికి శరీరంలో శక్తి స్థాయిలను పెంచి నీరసం, అలసటలకు దూరంచేస్తుంది.