రోజు ఒక ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్న ఆరోగ్యంగా జీవించవచ్చు. చవచగా అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక రకాల రోగాల నుండి బయటపడవచ్చు. అరటి పండు పక్వానికి వచ్చే కొద్దీ సాధారణ చక్కెరల మార్పులకు గురవుతోంది కానీ క్యాలరీల సంఖ్య మాత్రం తగ్గదు. గోధుమ రంగు మచ్చలు ఉండే అరటి పండులో తగినన్ని పోషకాలు ఉంటాయి. అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.
అరటి పండ్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
- అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలకు మరియు దంతాలకు చాలా మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది.
- వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడం వల్ల మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు నుండి తప్పించుకోవచ్చు అని ఒక అధ్యాయం లో తేలింది.
- రోజుకో అరటిపండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
- అరటి పండ్లలో ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి అవి రక్తపోటును తగ్గించి క్యాన్సర్ తో పోరాడుతాయి.
- ఫ్రీ రాడికల్స్ ఏర్పడడానికి అడ్డుకొని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
- బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా అరటి పండ్లను తినండి. అరటిపండులో కొవ్వు ఉండదు అలాగే కాలోరీలు కూడా చాలా తక్కువ. పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టన్స్ స్టార్చ్ (resistance strach) ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అరటి పండును బరువు తగ్గటానికి ఉపకరిస్తుంది.
- అరటి పండు క్యాన్సర్ కణాలతో పోరాడే ఉంది అరటిపండు తొక్క పై ఉండే ముదురు రంగు మచ్చలు tumor necrosis factor కు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్ తో శరీరంలో పేరుకుపోయిన అసంబద్ధత కణాలను చంపేస్తాయి.
- ఈ పండ్లలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగులను ఉత్తేజితం చేసి జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
అరటి పండ్లను కొనేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
కార్బైడ్ తో మరగబెట్టిన అరటి పండును తినడం ఆరోగ్యానికి హానికరం. త్వరగా రంగు వచ్చేందుకు వ్యాపారులు ఈ రసాయనాన్ని వాడుతూ ఉంటారు.

పచ్చని కాయలను క్షణాల్లో పసుపురంగులోకి మార్చేసి వాటిని అమ్మేస్తున్నారు వాటిని ఎలా గుర్తించాలో చూడండి. కార్బైడ్ తో మరగబెట్టిన అరటిపండు అరటిపండు గుత్తి పచ్చగా ఉంటుంది. నిమ్మకాయలా పసుపురంగులోకి మారుతుంది.

ఎలాంటి మచ్చలు ఉండవు. అయితే సహజసిద్ధంగా ఉండే అరటిపండు అరటి పండు గుత్తి రంగు నల్లగా ఉంటుంది తొక్క పై మచ్చలు ఉంటాయి అరటిపండు లేత పసుపు రంగులో ఉంటుంది.