What Your Tongue Says About Your Health Mouth Ulcer

నోటిలో కానీ నాలక పైన కానీ ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఇది చేయండి

చాలామందికి నోటిలో నంజు పొక్కులు వస్తుంటాయి. వీటినే మౌత్ అల్సర్ అంటారు. పెదవుల వెనుక, దవడ లోపలి భాగానికి ఈ అల్సర్లు వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఏమైనా తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కారం తగిలితే మంట పుడుతుంది. వీటికి ముఖ్య కారణం ఆహారంలో రిబోఫ్లేవిన్ తక్కువగా ఉండడమే. దానికి కారణం అంటే మనం తినే ఆహారాలు పైన ఉండే పొర బాగా పాలిష్ చేయడం వలన బియ్యం పప్పులపై ఉండే పొరను బాగా పాలిష్ చేయడం వల్ల బీ 12 కోల్పోతున్నాం. అయితే బియ్యం, పప్పులలో నుండి వచ్చే తవుడుతో పాటు మరి కొన్ని ఆహారాలలో బి 12ను పొందే అవకాశం ఉంది.

 అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు నాటువి అయినా లేదా పండించినవి అయినా 4 నుండి 5 శాతం రిబోప్లైవిన్  కలిగి ఉంటాయి. తర్వాత పదార్థం సోయా పాల నుండి తయారుచేసిన టోఫు. దీనిలో జీరో పాయింట్ ఫైవ్ నుండి జీరో పాయింట్ సిక్స్ వరకు రిబోప్లేవిన్ ఉంటుంది. సోయా గింజలను నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్లో నీటిని చేర్చి వడకట్టడం ద్వారా పాలను తీసుకోవాలి. వీటిని బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం పిండడం వలన పాలు విరిగిపోతాయి. దీని నుండి పన్నీర్ ను వేరు చేసి నీటిని పిండేసి ఫ్రిజ్లో పెట్టుకోవడం ద్వారా టోఫు  తయారవుతుంది. 

దీనిని ముక్కలుగా కోసి కూరల్లో  ఉపయోగించడం వల్ల శరీరానికి కావలసిన బి12 లభిస్తుంది. మూడవ పదార్థం మునగాకు. మునగాకులో పాయింట్ 5 నుండి 6 వరకు దొరుకుతుంది. దీన్ని కూరల్లో, జ్యూస్ లో కొద్దిగా చేర్చడం వలన శరీరానికి కావలసిన బి12 పొందవచ్చు తద్వారా పెదవుల వెనుక ఉండే  తగ్గించుకోవచ్చు. ఇక నాల్గవ పదార్థం తవుడులో బి12 పుష్కలంగా ఉంటుంది. అయితే అందరూ దీనిని నేరుగా తీసుకోలేకపోతున్నారు. కానీ దీనిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభించి శరీరంలో అనేక సమస్యలు నుండి నివారణ పొందవచ్చు. 

తవుడు తీసేసిన ఆహార పదార్ధాలు తినడం వలన శరీరానికి లభించే ప్రయోజనాలు కొన్ని మాత్రమే. కానీ తవుడు తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల సమస్యలు నివారించబడతాయి. ఇప్పుడు చెప్పిన నాలుగు పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా నోటిలోని అల్సర్లను త్వరగా తగ్గించుకోవచ్చు. దీనితో పాటు కొద్దిగా తేనెను అల్సర్లకి తరచూ రాయడం వలన ఈ నోటి అల్సర్లను తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!