తలకు నూనె రాయడం వలన జుట్టుకు పోషణ అంది జుట్టు బాగా పెరుగుతుందని మనం నమ్ముతుంటాం. నూటికి 97 శాతం మంది తలకు నూనె పెడుతూ ఉంటారు. కొంతమంది తలనొప్పిగా ఉన్నప్పుడు, తలలో వేడి ఎక్కువ అయినప్పుడు తలకు నూనె రాస్తారు. కొంతమంది నూనె అస్సలు రాయరు. నూటికి ఒకరూ ఇద్దరూ మాత్రం ఇలా తలనొప్పి, వేడి అయినప్పుడు మాత్రమే నూనె తలపైకి రానిస్తుంటారు. తలకు నూనె రాసి అది ఆరిన తరువాత తలస్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రిపూట తలకు నూనె రాసి ఉదయాన్నే తల స్నానం చేస్తారు.
ఇలా చేయడం వల్ల తనకు పోషణ అందుతుంది, తలలో వేడి తగ్గుతుందని జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. కొంతమంది కొబ్బరినూనెను నేరుగా తలకు అప్లై చేస్తే కొంతమందిని దానిలో రకరకాల మూలికలు వేసి నూనెను తయారు చేసి తలకు అప్లై చేస్తుంటారు. నూనెలు ఎలా రాసినా ఎప్పుడు రాయాలో తెలుసుకోవడం చాలా అవసరం. నూనె ఎప్పుడు, ఎలా రాసుకోవాలి తెలిస్తే తగువులు, దరిద్రానికి దూరంగా ఉండవచ్చు. దానివలన శని, కుజుల ప్రభావంకి దూరంగా ఉండవచ్చు. నూనె గురించి ఈ విషయాలు తెలుసుకుంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం చేతిలో డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోవడం వంటి సంఘటన నుంచి బయటపడవచ్చు.
కొంత మంది ఉదయం లేచిన వెంటనే తలకు నూనె అప్లై చేస్తూ ఉంటారు. పూర్తిగా తలను నూనెతో ముంచేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పడుకోవడానికి ముందు నూనె అప్లై చేస్తుంటారు. అయితే ఇలా ఉదయం, సాయంత్రం నూనె రాయడం తప్పు. ఇలా రాయడం వలన జేష్టాదేవిని ఆహ్వానించినట్టు. పడుకునే ముందు నూనె రాయడం వల్ల అనేక అనారోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి. కొంతమందికి తలనొప్పి, తలలో నరాలు లాగేస్తున్నట్టు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు నూనె రాసుకోవడం ఆమోదయోగ్యమే. వారికి ఔషధంగా భావించాలి.
ఇలా ఉదయం, సాయంత్రం రాసుకోవడంతో పాటు మంగళ, శుక్రవారాల్లో కూడా నూనె తలకు అప్లై చేయకూడదు. ఈ రోజుల్లో నూనెను అప్లై చేయడం వల్ల శని, కుజ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నూనెను ముఖ్యంగా శుక్రవారం పూట అప్లై చేయకుండా ఉండాలి. శుక్రవారం అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టమైన రోజు. నూనె నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. శుక్రవారం పూట నూనె పెట్టడం వల్ల లక్ష్మీదేవి దూరంగా వెళ్లి పోతుంది అని నమ్ముతారు. అందుకే శుక్రవారం, మంగళవారం అప్లై చేయకుండా మిగతా రోజులు అప్లై చేసుకోవచ్చు. ఉదయం లేచిన వెంటనే మరియు సాయంత్రం పడుకునే ముందు కూడా నూనెను అప్లై చేయకూడదు.