which cooking oil is best for health

మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

మొక్కల నుండి సేకరించిన తినదగిన నూనెలను సాధారణంగా కూరగాయల నూనెలు అంటారు.మార్కెట్లో అనేకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవి ఆరోగ్య కరమో ఇప్పుడు తెలుసుకుందాం.మనం బయటదొరికే ఆహారం తీసుకోకూడదు అనుకుంటాం. అసలెందుకు తినకూడదు. ఎందుకంటే బయట దొరికే నూనెలు కల్తీ మరియు చాలా సార్లు వినియోగించడంవలన అవి టాక్సిన్లు విడుదలచేస్తాయి. అవి శరీరంలో అధికబరువును, కొలెస్ట్రాల్, గుండె నాళాల్లో గడ్డలు, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, హైబి.పీకి, కాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.

నూనెలో రకాలు అంటే ప్యూర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వర్జిన్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ అనే రకాలు ఉంటాయి. ప్రతీ నూనెను ఎందుకు వాడాలో ఏకాలంలో వాడాలో తెలుసుకుందాం. రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.ఇది తయారు చేసే క్రమంలో అనేక రసాయనాలు కలపడంతో పాటు నూనె వేడెక్కడం వలన అందులో ఉండే పోషకాలను కోల్పోతాం. ఈ నూనె ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడతారు. అందుకే రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ నూనెలను వాడడం మంచిది కాదు. 

గానుగనూనెలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తయారు చేసే పద్దతి చాలా సహజమైనది.ఈ పద్దతిలో విత్తనాలు నెమ్మదిగా రుబ్బుతూ నూనెలను తీస్తారు. దీనినే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనికూడా అంటారు. ఇందులో నువ్వులనూనె, వేరుశనగ, ఆవనూనె, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, రైస్బ్రాన్ ఆయిల్ , కొబ్బరి నూనెలు వంటకోసం ఉపయోగించడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ రకరకాలగా అంటే ఆలివ్ ఆయిల్ తక్కువ వేడిమీద వండడానికి మిగతావి డీప్ ఫ్రైవంటి వంటలకు కూడా ఉపయోగించవచ్చు.

నూనెలను ఇలా ఉపయోగించకూడదు. నూనెలను పదపదే ఉపయోగించడం వలన అందులో ఉండే విటమిన్స్, పోషకాలను కోల్పోతాం మరియు  నూనె కాన్సర్ కారకంగా మారిపోతుంది. అలాగే శరీరంలో కొవ్వును పెంచుతుంది. అందుకే ఒకసారి ఉపయోగించిన నూనె మళ్ళీ  ఉపయోగించకూడదు. ఎప్పుడూ ఒకరకం నూనెను మాత్రమే ఉపయోగించకూడదు. అన్ని రకాల నూనెలను  ఉపయోగిస్తూ నాలుగునెలల కోసారి మార్చుతూ ఉండాలి.ఒక్కొక్కరు రోజుకు 20 గ్రాముల నూనె మాత్రమే ఉపయోగించాలి. ప్రత్యేక సందర్భాలలో తప్ప ఈ నియమాలను పాటించాలి. నూనె వాడకం తగ్గించడంవలన అనేక ఆరోగ్య సమస్యలు నుండి తప్పించుకోవచ్చు.

1 thought on “మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil”

Leave a Comment

error: Content is protected !!