which food items should take during winter

శీతాకాలం వచ్చిందని భయపడుతున్నారా?? మీకోసమే ఇది.

శీతాకాలంలో చల్లని వాతావరణాన్ని వెచ్చని దుస్తులతో మరియు వేడి వేడి ఆహారంతో చాలా ఎంజాయ్ చేస్తాం. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే నాణానికి మరోవైపు కోణం ఉంది. అదే  కాలం మారడం వల్ల వచ్చే జబ్బులు. వాతావరణం లో తేమ పెరగడం వల్ల, చుట్టూ పరిసరాలు చల్లగా ఉండటం వల్ల స్వతహాగానే బాక్టీరియా, వైరస్ పెరగడానికి అనువుగా వాతావరణం తయారవుతుంది. అంతేకాదు శరీరంలో  బ్లడ్ ph స్థాయిలు అకస్మాత్తుగా తగ్గడం కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తుంది.  వీటిని అధిగమిస్తూ ఈ శీతాకాలన్ని కూడా అందంగా గడిపేయాలంటే కాలానికి తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. మరి శీతాకాలంలో ఏ ఆహారం తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనేది ఒక్కసారి చూద్దాం.

తీసుకోవలసిన ఆహారం.

◆ప్రోటీన్లు గల ఆహారాన్ని తీసుకోవడం ప్రథమంగా అందరూ పాటించవలసినది.  పాలు గుడ్లు తప్పనిసరిగా ఆహారంలో జోడించుకోవాలి.  వీటివల్ల బ్లడ్ PH స్థాయిలు పెరగడమే కాక శరీరంలో వెచ్చదనాన్ని ఇస్తాయి.

◆మనం తీసుకునే ఆహారంలో నియాసిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి దీని ఫలితంగా శరీరానికి చల్లని వాతావరణాన్ని తట్టుకోగల సామర్థ్యము వస్తుంది.

◆సాధారణంగా చలికాలంలో వేడి పదార్థాలకు ప్రాముఖ్యత ఇవ్వడం సహజం అయితే గోధుమలు, వాటితో చేసే రొట్టెలు తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న విటమిన్ బి అధికంగా లభిస్తుంది. 

◆శీతాకాలంలో  చల్లని వాతావరణ ప్రభావం వల్ల ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ద్రవపదార్థాలు చాలా దూరంగా ఉంటారు. అలాంటివాళ్ళు గమనించుకోవలసింది శరీరానికి ద్రవపదార్థాలు ముఖ్యమైన ఉత్ప్రేరకాలు అని. 

◆ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో ఫైబర్ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. 

◆అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు వ్యాధినిరోధక శక్తిని పెంచే  విటమిన్ సి అధికంగా గల పండ్లను తీసుకుంటూ ఉండాలి. 

◆జింక్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి.

◆థైరాయిడ్ హార్మోన్ పనితీరు సక్రమంగా ఉండటానికి ఐరన్, ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

◆శరీరంలో వేడిని సమతాస్థితిలో ఉంచడానికి వేడి సూప్ లు, ఆహారపదార్థాలు, వేడిగా ఉన్నవాటిని తీసుకోవాలి. 

తినకూడని ఆహారపదార్థాలు

◆చల్లటి ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, ఫ్రిజ్ లో నిల్వ చేసిన పదార్థాలు వంటివి తీసుకోకూడదు. 

◆బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. బేకరిలలో వనస్పతి ఉపయోగించి తయారుచేసిన బేక్ చేసిన పదార్థాలు, డీప్ ఫ్రై చేసిన పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం. శీతల వాతావరణం వల్ల మనం తీసుకున్న నూనె పదార్థాలు శరీరంలో చాలా నిదానంగా జీర్ణమవుతాయి. కొన్ని తటస్థమైపోయి పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో ఫ్యాట్ రూపంలో పేరుకుపోతాయి.

◆కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న పిండిపదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

◆ఆహారాన్ని మితంగా తీసుకుంటూ నీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణం సమతాస్థితిలో ఉంటుంది.

చివరగా…..

కాలం మారినా ఆహారం తీసుకునే సమయాలు కచ్చితంగా మైంటైన్ చేయడం వల్ల మరియు పైన చెప్పినవి పాటించడం వల్ల శీతాకాలన్ని కూడా వెచ్చగా ఆస్వాదించవచ్చు

Leave a Comment

error: Content is protected !!