ఆహారం మనిషి నిత్యావసరాలలో ఒకటి.అలాంటి ఆహారం మితంగా తింటే అమృతం,అమితంగా తింటే విషం అనేది పెద్దల నానుడి.ఆహారం సరైన పద్ధతిలో తీసుకుంటే మనిషికి శక్తినిచ్చి ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో, అలాగే కలవకూడని పదార్థాలు కలిపి తినడం వలన ఆరోగ్యానికి సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది.
మనం ఆహారం తీసుకునేటప్పుడు చాలాసేపు నమిలితినాలి.తినేటప్పుడు మోతాదుకు మించి నీరు తాగకూడదు అంటారు.అప్పుడే అది సరిగ్గా జీర్ణమయి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.కానీ మనం కొన్నిసార్లు తొందరగా తినాలని రెంటినీ కలిపేస్తాం.
అలాగే కొన్నిసమయాల్లో కొత్త ప్రయోగాల కోసం కొన్ని ఆహారపదార్థాలు కలిపి తింటుంటాం.అవి జీర్ణం అయ్యే సమయంలో అందులో ఉండే యాసిడ్స్ ,జీర్ణరసాలపై ప్రభావం చూపుతాయి.దానివలన శరీర సమతుల్యత దెబ్బతిని అనారోగ్యానికి కారణమవుతాయి. ఆయుర్వేదంలో ఇలా తినకూడని పదార్థాలు గురించి చర్చించారు.అలా తినకూడని ఆహారంలో మనం ఎక్కువగా వినేది గుడ్డు,పొట్లకాయ గురించి.ఇవేకాకుండా..
- కోడిమాసంతో – పాలు
- పాలుతో – పెరుగు,జున్ను,కోడిగుడ్లు,చేపలు వేడిపానీయాలు
- ముల్లంగితో -అరటిపండ్లు,ఎండుద్రాక్ష,పాలు
- పుచ్చకాయతో-ద్రవపదార్థాలు,నీళ్ళు,వేయించిన కూరలు
- బీన్స్ తో- జున్ను,కోడిగుడ్లు,చేప ,పెరుగు,పండ్లు
- వేడి పానీయాలతో- మామిడిపండ్లు, జున్ను , చేప, పెరుగు
- టీ తీసుకున్న వెంటనే పెరుగు
- నిమ్మకాయలు వంటి పుల్లటి పండ్లతో – దోసకాయ,పాలు,టమోటా,పెరుగు
- కోడిగుడ్డుతో – జున్ను,చేప,పాలు,పెరుగు,
- చిరుధాన్యాలు ,గింజలతో -పండ్లు
- తేనె-నెయ్యి
- పాలు- అరటిపండు
ఈ పదార్థాలు కలిపి తినడం వలన చర్మంపై దద్దుర్లు వచ్చి దురదరావడం, పొట్టలో గ్యాస్ కడుపుఉబ్బరం,నొప్పి లాంటి సమస్యలకు గురవుతుంటారు.ఇవేకాకుండా తలనొప్పి,గ్యాస్ చేరి పుల్లటి త్రేన్పులు,మగతగా ఉండడం,కళ్ళు తిరగడం ,సరైన నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపించినా మనం తిన్న ఆహారమే కారణం కావచ్చని వైద్యుల అభిప్రాయం.
ఒక్కోసారి తిన్న వెంటనే ప్రభావం చూపించకపోయినా కాలక్రమంలో అనారోగ్య సమస్యలను ప్రేరేపిస్తాయి.ఇలా తినడంవలన ఆహారపదార్థాలు మన శరీరంలోని వాత,పిత్త,కఫ రసాలపై ప్రభావం చూపుతాయి.నేటి ఆధునిక జీవనశైలిలో మనం తెలియకుండా తినే చాలా ఆహారపదార్థాలు మనల్ని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. అవగాహన లేమే దీనికి కారణం.పెద్దలు ఆచరించిన ఆయుర్వేదంలో ఉన్న మన నిత్యజీవితాన్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా మార్చే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతో మనం కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం.
మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.