which home made oil is best for hair growth

పల్చగా ఉన్న చుట్టూ అయినా సరే ఈ నూనె రాస్తే మీ జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా, చాలా స్పీడ్ గా పెరుగుతుంది…

చాలామంది వారి యొక్క జుట్టు చాలా పల్చగా ఉంది అని. తోకల ఎలాడుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు. దీనికోసం చాలా రకాల హెయిర్ ఆయిల్ వాడుతూ దాని వలన ఎటువంటి ఫలితం లేక నిరాశ చెందుతూ ఉంటున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతున్నారు. మరియు పార్లర్ చుట్టూ కూడా ఎక్కువగా తిరుగుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా సరే అక్కడ కూడా మంచి ఫలితం ఉండడం లేదు. ఇటువంటి వారికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

                     దీనిలో ఉపయోగించేవన్నీ మన ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవి. కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 300ml కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి సన్నని సెగ పెట్టి అందులో ముందుగా ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ తరువాత నాలుగు లవంగాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక గడ్డ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.

                ఆ తర్వాత నాలుగు కొమ్మల తులసాకులు వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు గోరింటాకులు వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులు వేసుకోవాలి. తర్వాత ఒక అయిదారు మందార పువ్వులను వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండు ఉసిరికాయ ముక్కలను ఒక గుప్పెడు వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు గరిక ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు సెగను హై ఫ్లేమ్ లో పెట్టుకొని నూనె రంగు మారేంతవరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన నూనెను వేడిగా ఉండగానే వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి.

                  ఇలా తయారైన నూనెను రోజు మనం తలకు కుదుళ్ళ నుంచి చిగుళ్ల వరకు బాగా పట్టించాలి. ఇలా ఉపయోగించడం ద్వారా 15 రోజుల్లోనే కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. వారానికి రెండు రోజులు ఏదైనా మైల్డ్ షాంపూ ఉపయోగించి లేదా హోం మేడ్ షాంపుతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మన జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతుంది…

Leave a Comment

error: Content is protected !!