తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్) సమస్య ఆడవారిలో చికాకు, నిస్సత్తువకు కారణమవుతుంది. అధికంగా ఉండే తెల్లబట్టలో దుర్వాసన, దురద లేకపోతే సమస్య లేదు. కానీ ఇవన్నీ ఉన్నా అశ్రద్ధ చేస్తుంటే అది అనేక ఇతర అనారోగ్యసమస్యలు చుట్టు ముడతాయి. తెల్లబట్ట అనేది మెచ్యూర్ అయిన అమ్మాయి నుంచి మెనోపాజ్ వచ్చిన స్ర్తీలవరకూ సమస్య ఉంటుంది.
ఈ తెల్లబట్ట సమస్య పసుపు, ముదురు పచ్చ రంగులో ఉంటే అది ఇన్పెక్షన్ లా భావించాలి. శరీరంలో పొత్తికడుపులో ఇన్ఫెక్షన్, కింది భాగంలో వాపులు, ఓవేరియాన్ కాన్సర్ కి కారణమవుతాయి. కొంచెం శ్రద్ధ తీసుకుంటే అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమస్య ను డాక్టర్ దగ్గర చెప్పాలన్నా, చూపించాలన్నా సిగ్గు పడుతుంటారు. అలాంటి వారు ఇంటిచిట్కాలతో సమస్య ను తగ్గించుకోవచ్చు.
దానికోసం గులాబీ రేకులను తీసుకోవాలి. దేశీ గులాబీలు అయితేమంచిది. గులాబీ రేకులు తాజాగా ఉండాలి. లేకపోతేనే ఎండురేకులు తీసుకోవాలి. వీటిని ఒకగిన్నెలో నీళ్ళు పోసి గులాబీ రేకులు వేసి మరిగించాలి. ఈ పూలరేకుల సారం మొత్తం నీటిలో దిగాక మంట ఆపి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిని రోజూ తాగడంవలన శరీరంలో పీ.హెచ్ లెవల్ పెరుగుతుంది. అనేకరకాల బాక్టీరియా నాశనమయ్యీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
అలాగే ఈ సమస్యను తగ్గించే ప్రభావవంతమైన చిట్కా ఇంకొకటి. ఒకగిన్నెలో గ్లాసుడు నీటిని తీసుకుని అందులో ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవాలి. ధనియాలలో ఉండే సారం నీళ్ళు మరిగి అందులోకి రావాలి. ఆ నీళ్ళు రంగుమారగానే నీటిని వడకట్టి కొంచెం గోరువెచ్చగా రోజులో రెండు సార్లు కొంచెం కొంచెం గా తీసుకోవాలి.
ఇలా రోజూ ఈ రెండుచిట్కాలలో ఏదొకటి ప్రయత్నించడం వలన శరీరంలో పీ.హెచ్ లెవల్ పెరిగి దురద, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు నిరోధించబడతాయి. ఈ చిట్కాలు, లోపలికి తీసుకునే మందులే కాకుండా కొన్ని సూచనలు కూడా పాటించాలి. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
రోజులో ఒకసారైనా మైల్డ్ సోప్, ఇంటర్నల్ వాష్లతో శుభ్రపరుచుకోవాలి. ఘాడమైన సబ్బు వాడకూడదు. దానివలన మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పీరియడ్స్ టైంలో శానిటరీ పాడ్స్ వాడాలి. అవి ప్రతి రెండు గంటలకు ఒకసారి మార్చాలి. మంచినీటిని ఎక్కువగా తాగుతూ వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి.