హలో ఫ్రెండ్స్… ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్లజుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు మార్కెట్లో దొరికే బ్లాక్ హెన్న షాంపూ హెయిర్ డ్రై ఇలాంటి మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు. వీటిని వాడడం వల్ల తాత్కాలికంగా ఫలితం బాగానే ఉంటుంది కానీ తరచు వీటిని వాడుతూ ఉంటే కచ్చితంగా మీ జుట్టు డామేజ్ అవుతుంది. మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తెల్ల జుట్టును నల్లగా మార్చే కొన్ని అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక మంచి ఆయుర్వేదిక్ remedy ఇప్పుడు తెలుసుకుందాం.
రెమిడికి తయారీకి కావలసిన పదార్థాలు
- పచ్చిపటిక లేదా స్పటిక (ఆయుర్వేదిక్ షాప్ లో ట్రై చేయండి) 2 స్పూన్లు
- ఉసిరి నూనె 4 స్పూన్లు
- విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2
తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల పటిక పొడిని వేసుకోండి
- ఇందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల మోతాదులో ఉసిరి నూనెను కలపండి
- ఇందులో కి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను కట్ చేసి ఆయిల్ ఇందులో కలపండి
- ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్టు లా చేయండి
రెమిడి ఎలా ఉపయోగించాలి
- మీరు తలస్నానం చేయాలనుకున్న ఒక గంట ముందు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఒక కాటన్ బాల్ తో కానీ మీ చేతితో కానీ మీ జుట్టు కుదుళ్లకు ఈ పేస్ట్ మొత్తాన్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కనీసం 2-3 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయండి.
- తర్వాత 1-2 గంటలు ఆరనివ్వండి. తర్వాత హెర్బల్ లేదా ఆయుర్వేదిక్ షాంపు ఉపయోగించి తలస్నానం చేయండి
- ఇలా కనుక ఈ రెమిడి వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే దీంతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం మీరే చూస్తారు.

స్పటిక మన ఆయుర్వేద వైద్యంలో ఒక ఔషదంలాగా ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ స్పటిక లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి మాత్రమే కాకుండా మన శరీరంలోని 300కుపైగా అనారోగ్యాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది
ఉసిరిలో లో విటమిన్స్ మినరల్స్ ఎమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన తెల్ల జుట్టు నల్లగా మారడం తో పాటు మన జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. దీనివల్ల మన హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ఉసిరి లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన జుట్టుకు లలోకి చొచ్చుకొనిపోయి మన జుట్టు ఒత్తుగా నల్లగా పెరిగేటట్లు చేస్తుంది
విటమిన్ ఇ మన జుట్టు కుదుళ్లకు తగినంత రక్త ప్రసరణ జరిగేటట్లు చేయడంతోపాటు మన జుట్టుకు కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరగడంతోపాటు మీ తెల్ల జుట్టు తిరిగి నల్లగా మారుతుంది