how to turn grey hair into black permanently naturally

తెల్లజుట్టు నల్లగ అవ్వదని ఇంకెప్పుడు అనరు..

వయస్సు పెరిగే కొద్దీ తెల్లజుట్టు రావటం సహజ ప్రక్రియ. కానీ కొంతమందిలో చాలా తక్కువ వయస్సులోనే తెల్లజుట్టు రావటం, బాధపడుతూ ఉండటం, మార్కెట్లలో దొరికే హెయిర్ కలర్ వేసుకోవటం. అక్కడ నుంచి మరిన్ని సమస్యలు ఎదురుకోవటం చూస్తూ ఉంటాం. తెల్ల జుట్టుకి వృద్ధాప్యం ఒక కారణం అయితే. మరి కొన్ని సార్లు.. 

-కలుషితమైన వాతావరణం,-పోషక ఆహారం కొరత, 

-అనువంశిక కారణాలు, -జుట్టుకు నల్లరంగుని అందించే మెలనిన్ తగ్గిపోవటం, *ఇంకా ముఖ్యంగా; 

-గజి బిజిగా మారిపోతున్న జీవిత విధానం, ఒత్తిడి, నిద్రలేకపోవటం, సత్వ గుణ ఆహారం లేకపోవడం.

-థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో కూడా ఈ తెల్లజుట్టు లక్షణాలు ఉంటాయి. 

-విటమిన్ బి-12 లోపం ఉన్న వారిలో కూడా తెల్ల జుట్టు సమస్యలు ఎదురవుతాయి.

-కఠిన జలం(హార్డ్ వాటర్) స్నానం, ధూమపాన సేవన, అతి ఆందోళన, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయం తెల్ల జుట్టు రావటానికి కారణాలు. 
*పరిహారం

 ఒక ఇనుము కడాయి తీసుకొని అందులో50ml కొబ్బరి నూనె వేసుకోండి. గానుగ పద్దతిలో తీసిన కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిది. ఆ కొబ్బరి నూనెలో గుంట గలగర అదేనండి భృంగరాజ పొడిని ఒక టేబుల్ స్పూన్ వేసి, సన్నని మంటపై వేడి చెయ్యండి.. ఇందులో కొన్ని మెంతులు కూడా కలిపి వేడి చేసుకోండి. మెంతులు కానీ, భృంగరాజ పొడి కానీ మాడిపోరాదు. ఇలా వేడి చేసుకున్న నూనెను ఫిల్టర్ చేసి గాజు గిన్నె, సీసాలో వేసుకోండి. వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ తలకు పట్టించడం వల్ల తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది. ముఖ్యంగా దీనికి ఇనుప కడాయి వాడాలి అదే బెస్ట్ రిజల్ట్స్ అందిస్తుంది.

భృంగరాజ తడిగా ఉన్న చోటుల్లో చాలా సులువుగా దానికి అదే పెరిగిపోతుంది.

-భృంగరాజ కుదుళ్లకు జీవశక్తిని అందిస్తుంది.-బట్ట తల సమస్య నివారిణి.

-చుండ్రు పోగొడుతుంది.-యాంటీ బ్యాక్టరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. 

-హెయిర్ ఫోలిక్ ఆక్టివేట్ చేస్తుంది దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

-తలనొప్పి మరియుమైగ్రేన్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎండకాలంలో ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టులో వేడి తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది.ఎప్పుడైతే మన తలభాగం చల్లబడుతుందో అప్పుడు ప్రశాంతంగా నిద్ర వస్తుంది.చెప్పిన విధానంలో ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వారానికి రెండు సార్లు ఖచ్చితంగా వాడుకోండి. తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. 

Leave a Comment

error: Content is protected !!